ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను వైసీపీ( YCP ) చాలా సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.కాగా ఎన్నికలకి ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.
ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సంబంధించి ప్రజా వ్యతిరేకత ఉంటే వాళ్లని జగన్ పక్కన పెట్టేస్తున్నారు.అంతేకాకుండా కొంతమందిని మరోచోట పోటీ చేయించేలా మార్పులు చేర్పులు చేస్తున్నారు.
ఈ రకంగా మొదట 11 స్థానాలకు సంబంధించి ఇన్ ఛార్జ్ లా నియామకాలు మార్పులు చేర్పుల లిస్ట్ విడుదల చేయడం జరిగింది.తాజాగా రెండో జాబితాలో 27 మంది ఇన్ ఛార్జ్ లతో వైసీపీ లిస్టు విడుదల చేయడం జరిగింది.
ఈ మేరకు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుండి రెండో జాబితా లిస్ట్ రిలీజ్ అయింది.ఆ లిస్టు లో పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) గారి ఆదేశాల మేరకు, ఈ క్రింద పేర్కొన్న వారిని “పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు”గా నియమించడమైనది.

1) అనంతపురం ఎంపీ- శ్రీ మాలగుండ్ల శంకరనారాయణ 2) హిందూపురం ఎంపీ- శ్రీమతి జోలదరాశి శాంత 3) అరకు ఎంపీ (ఎస్టీ)- శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి 4) రాజాం (ఎస్సీ) డా॥ తాలె రాజేష్ 5) అనకాపల్లి- శ్రీ మలసాల భరత్ కుమార్ 6) పాయకరావుపేట (ఎస్సీ)- శ్రీ కంబాల జోగులు 7) రామచంద్రాపురం- శ్రీ పిల్లి సూర్యప్రకాష్ 8) పి.గన్నవరం (ఎస్సీ)- శ్రీ విప్పర్తి వేణుగోపాల్ 9) పిఠాపురం- శ్రీమతి వంగ గీత 10) జగ్గంపేట- శ్రీ తోట నరసింహం 11) ప్రత్తిపాడు- శ్రీ వరుపుల సుబ్బారావు 12) రాజమండ్రి సిటీ- శ్రీ మార్గాని భరత్ 13) రాజమండ్రి రూరల్- శ్రీ చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ 14) పోలవరం (ఎస్టీ)- శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి 15)కదిరి – శ్రీ బి.ఎస్.మక్బూల్ అహ్మద్ 16) ఎర్రగొండపాలెం (ఎస్సీ)- శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ 17) ఎమ్మిగనూర్- శ్రీ మాచాని వెంకటేష్ 18) తిరుపతి- శ్రీ భూమన అభినయ్ రెడ్డి 19) గుంటూరు ఈస్ట్-శ్రీమతి షేక్ నూరి ఫాతిమా 20) మచిలీపట్నం- శ్రీ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) 21) చంద్రగిరి– శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి 22) పెనుకొండ-శ్రీమతి కె.వి.ఉషా శ్రీచరణ్ 23) కళ్యాణదుర్గం-శ్రీ తలారి రంగయ్య 24)అరకు(ఎస్టీ) – శ్రీమతి గొడ్డేటి మాధవి 25) పాడేరు (ఎస్టీ)- శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రాజు 26) విజయవాడ సెంట్రల్- శ్రీ వెలంపల్లి శ్రీనివాస రావు 27) విజయవాడ వెస్ట్- శ్రీ షేక్ ఆసిఫ్
.