అవును, మీరు విన్నది నిజమే.ఇక బేసిక్ ఫోన్స్ మార్కెట్లో కనబడవు.
బేసిక్స్ ఫోన్స్ కి పెట్టింది పేరు అయినటువంటి ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘శాంసంగ్’ తయారు చేస్తున్న బేసిక్ ఫోన్లు చాలామంది భారతీయులకు ఫేవరెట్‌గా మారాయి.రూ.1,500 ఖరీదైన బేసిక్ ఫోన్స్ నుంచి రూ.లక్ష వరకు విలువైన ప్రీమియం ఫోన్ల వరకు చాలా మొబైల్స్‌ను ఇండియన్ యూజర్లకు శాంసంగ్ పరిచయం చేసింది.అయితే ఈ కంపెనీ ఇకపై తక్కువ ధర గల ఫీచర్ ఫోన్ల అమ్మకాలను ఇండియాలో నిలిపివేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.శాంసంగ్ భారత్‌లో ఫీచర్ ఫోన్ మార్కెట్ నుంచి వైదొలగాలని యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ తెలిపింది.
ఈ నివేదిక ప్రకారం, శాంసంగ్ చివరి బ్యాచ్ ఫీచర్ ఫోన్‌లను డిక్సన్ ఈ సంవత్సరం డిసెంబర్‌లో తయారు చేయనుంది.ఆ తరువాత, కంపెనీ భారత్‌లో ఫీచర్ ఫోన్‌లను తయారు చేయదు.
ఫీచర్ ఫోన్ల తయారీ, అమ్మకాలు నిలిపేసి శాంసంగ్ తన దృష్టిని హై-ఎండ్ మొబైల్స్ వైపు మళ్లించనుందని తెలుస్తోంది.శాంసంగ్ కంపెనీ ఇండియాలో ఎక్కువగా రూ.15,000, అంతకన్నా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తుందని ఒక అధికారి తెలిపారు.అయితే ఫీచర్ ఫోన్ అమ్మకాలను ఆపాలని నిర్ణయించడానికి ప్రధాన కారణం అవి ఎక్కువగా ఖర్చు కాకపోవడమే నివేదిక వివరించింది.

ఇటీవలి కాలంలో భారత్‌లో ఫీచర్ ఫోన్లు కొనుగోళ్లు భారీగా పడిపోయాయి.కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం, 2022 మొదటి త్రైమాసికంలో మార్కెట్ సంవత్సరానికి 39 శాతం క్షీణత నమోదయింది.కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఫీచర్ ఫోన్‌ల మార్కెట్‌లో టాప్ ప్లేసులో ఉన్న శాంసంగ్ ఇప్పుడు ఐటల్, లవా కంటే వెనుకబడింది.మార్చి చివరి వరకు శాంసంగ్‌కు బేసిక్ ఫోన్ సెగ్మెంట్ విలువలో కేవలం 1 శాతం, వాల్యూమ్‌లలో 20 శాతం మాత్రమే అందించిందని నివేదిక పేర్కొంది.