అదే కాన్ఫిడెన్స్ .. పార్టీ నేతలకు జగన్ ఏం చెప్పారు ?

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM Jagan) మొదటి నుంచి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.ఇటీవలే ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.

ఈ పోల్స్ లో చాలా వరకు టీడీపీ కూటమికి, మరికొన్ని వైసీపీకి అనుకూలంగా ఉండడంతో,  ఖచ్చితమైన ఫలితం ఏంటి అనేది ఎవరికీ అంతుపట్టని విషయంగానే ఉంది.అయితే మొదటి నుంచి జగన్ మాత్రం గెలుపుపై కాన్ఫిడెన్స్ తోనే ఉన్నారు.

పార్టీ శ్రేణులకు పదే పదే అదే విషయాన్ని చెబుతున్నారు.ఎగ్జిట్ పోల్స్, సర్వే రిపోర్ట్ లు ఇవేవీ పట్టించుకోనట్టుగానే జగన్ వ్యవహరిస్తున్నారు.

ఖచ్చితంగా గెలుస్తామని, 9 న విశాఖ లో ప్రమాణ స్వీకారం ఉంటుందని ధీమా గా చెబుతూ వస్తున్నారు.మొదటి నుంచి తాను చెబుతున్నట్లుగానే ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయి అని, దీనిలో సందేహమే లేదు అంటూ చెబుతున్నారు.

Advertisement

తాజాగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల పై పార్టీ కీలక నేతలతో జగన్( AP cm jagan) చర్చించారు.ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ పైన దిశా నిర్దేశం చేశారు.అలాగే కౌంటింగ్ విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

గత నెల 13 న జరిగిన పోలింగ్ పైన వరుసగా రెండు రోజులు సమీక్ష చేశారు.ఇప్పటి వరకు అనేక మార్గాల్లో సేకరించిన సమాచారంపైన లోతుగా అధ్యయనం తరువాత ఒక నిర్ణయానికి వచ్చారు.

ఐ ప్యాక్ టీం తో జరిగిన సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని జగన్ చెప్పారు.

ఇప్పటికే అదే అంచనాలతో ఉన్నారు.ఫలితం పై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, కచ్చితంగా భారీ విజయం దక్కబోవుతోంది అంటూ నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.ఇక రేపు ఎన్నికల ఫలితాలు విడుదల కాబోతూ ఉండడంతో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో ఆరో తేదీన తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

ఈ మేరకు కౌంటింగ్ తర్వాత ప్రతి ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని, ఎంపీ అభ్యర్థులతో సహా అందరూ తాడేపల్లి( Tadepalle )లో అందుబాటులో ఉండాలని జగన్ సూచించారట.

Advertisement

తాజా వార్తలు