తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి విజయ్ దేవరకొండ( Vijay Devarakonda )కు గత కొద్ది రోజుల్లో వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడుతూ ఉన్నాయి.ఇలా ఫ్లాప్ సినిమాలో వచ్చినప్పటికీ ఈయన ఎంతో ధైర్యంతో లైగర్ ( Liger ) అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్ గా నిలిచింది.ఇలా వరుస ప్లాప్ సినిమాలు విజయ్ దేవరకొండను వెంటాడుతున్న ఈయనకు మాత్రం క్రేజ్ అస్సలు.
విజయ్ దేవరకొండకు రోజురోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.ముఖ్యంగా యూత్ ఈయనకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు.ఇక ఈయన స్టైల్ కు అమ్మాయిలు అభిమానులుగా మారిపోయారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు ఈ రౌడీ హీరో.
ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏకంగా 18 మిలియన్ ఫాలోవర్స్( 18 Million Fallowers ) ను సంపాదించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదని చెప్పాలి.
ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు కూడా ఈ స్థాయిలో అభిమానులను సంపాదించుకోవడం కోసం కాస్త సమయం పట్టిందని చెప్పాలి కానీ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఏకంగా 18 మిలియన్ ఫాలోవర్స్ సంపాదించుకొని సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు.ఇక ఈయన సినిమాల విషయానికొస్తే లైగర్ డిజాస్టర్ తర్వాత శివ నిర్వాణ ( Siva Nirvana )దర్శకత్వంలో సమంత( Samantha )తో కలిసి ఖుషి( Khushi ) సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమా తర్వాత ఈయన తన తదుపరిచిత్రాన్ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నారు.