అరుణాచల్ ప్రదేశ్( Arunachal Pradesh ) తమ భూభాగమని చైనా పేర్కొంది.అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టింది.
చైనా తీసుకున్న ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.అరుణాచల్ ప్రదేశ్ ముమ్మాటికీ తమ భూభాగమని, చైనా( China ) ఎత్తుగడలను గమనిస్తున్నామని పేర్కొంది.
ఈ తరుణంలో భారత్‌కు అంతర్జాతీయ( International ) మద్దతు లభిస్తోంది.తాజాగా అమెరికా స్పందించింది.
అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్‌కే తమ మద్దతు ఉంటుందని ప్రకటించింది.అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్‌ను భారతదేశంలో అంతర్భాగంగా యునైటెడ్ స్టేట్స్ గుర్తించిందని, ఆ ప్రాంతంలో కొన్నింటికి పేర్లు మార్చడాన్ని ఖండిస్తున్నట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

టిబెట్‌లోని దక్షిణ భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా పేర్కొంటోంది.ఆ రాష్ట్రంలోని మరో 11 ప్రదేశాలకు చైనా మంగళవారం కొత్త పేర్లను ప్రకటించింది.11 స్థలాల అధికారిక పేర్లను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసింది.మార్చబడిన పేర్లలో పర్వత శిఖరాలు, నదులు మరియు నివాస ప్రాంతాలు ఉన్నాయి.2017 ఏప్రిల్‌లో, 2021 డిసెంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా ఏకపక్షంగా స్థలాల పేరు మార్చడం ఇది మూడోసారి.చైనా వాదనలను భారత్ ఖండించింది.అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను మార్చే బీజింగ్ చర్యను భారతదేశం పూర్తిగా తిరస్కరించింది.విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) దీనిపై ఓ ప్రకటన చేసింది.అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగమని, పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలు మరుగవవని అన్నారు.
మే 2020లో ప్రారంభమైన తూర్పు లడఖ్‌లో ఇరు దేశాలు సరిహద్దు వివాదంలో చిక్కుకున్న సమయంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాలకు చైనా పేరు మార్చడం జరిగింది.ప్రతిష్టంభన తరువాత, అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్‌లో కూడా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంట భారతదేశం తన మొత్తం సైనిక సంసిద్ధతను పెంచుకుంది.
అయినా భారత్‌ను కవ్వించాలని చైనా ప్రయత్నిస్తోంది.