టెస్లా ఉద్యోగిపై దారుణమైన అటాక్‌ చేసిన రోబో.. చివరికి?

ఈ రోజుల్లో రోబోలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.దీనివల్ల వాటి వాడకం పైన ఆందోళనలు మొదలయ్యాయి.

 The Robot That Made A Brutal Attack On A Tesla Employee In The End , Tesla, Tesl-TeluguStop.com

ఇటీవల రోబో దాడికి సంబంధించిన మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. టెక్సాస్‌లోని టెస్లా కంపెనీ( Tesla Company in Texas ) కొత్త కర్మాగారంలో నియంత్రణ కోల్పోయిన ఓ రోబో ఉద్యోగిపై దాడి చేసింది.

ఈ రోబో కార్ల కోసం మెటల్ భాగాలను కత్తిరించాల్సి ఉంది, కానీ బదులుగా అది కార్మికుడిపై దాడి చేసింది.ఉద్యోగి దాని నుంచి తప్పించుకోగలిగాడు, కానీ అతను ఇప్పటికే తీవ్ర గాయాల పాలయ్యాడు.

అతడికి రక్తస్రావం బాగా అయింది.

ఇది 2021లో జరిగింది, కానీ తాజాగా మాత్రమే వెలుగులోకి వచ్చింది.

ది ఇన్ఫర్మేషన్ అనే న్యూస్ వెబ్‌సైట్ ఈ సంఘటన గురించి తెలుసుకుని గత నెలలో నివేదించింది.ఏం జరిగిందో చూసిన వారితో మాట్లాడి అధికారిక నివేదిక కాపీని కలెక్ట్ చేసింది.

దాడికి గురైన ఉద్యోగి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్( software engineer ).అతను రోబోలకు ఏమి చేయాలో చెప్పే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లో పని చేస్తున్నాడు.అతను, అతని సహచరులు రెండు రోబోలను ఆపివేశారు, తద్వారా వారు వాటిపై సురక్షితంగా పని చేయవచ్చు.అయితే యాక్టివ్‌గా ఉన్న మూడో రోబోను ఆఫ్ చేయడం మర్చిపోయారు.

Telugu Nri, Robot Attack, Tesla, Tesla Employee, Texastesla-Telugu NRI

మూడో రోబో( robot ) ఒక్కసారిగా కదిలి కార్మికుడిని పట్టుకుంది.అది అతనిని గట్టి ఉపరితలంపై నొక్కి, తన పదునైన గోళ్ళతో గీకింది.మరో కార్మికుడు దాన్ని మూసేయడానికి బటన్‌ను నొక్కే వరకు అది ఆగలేదు.దాడికి గురైన కార్మికుడు రోబో పట్టు నుంచి విడిపించుకోగలిగాడు.అతను రోబో నుంచి దూరంగా పారిపోయాడు, నేలపై రక్తం మొత్తం పడిపోయింది.ఉద్యోగి గాయపడ్డాడు, కానీ తృటిలో ప్రాణాపాయం తప్పింది.

అతని ఎడమ చేతికి వైద్యం అందించాల్సిన అవసరం వచ్చింది.గాయం కారణంగా అతను కొద్ది రోజులు సఫర్ అయ్యాడు.

Telugu Nri, Robot Attack, Tesla, Tesla Employee, Texastesla-Telugu NRI

టెస్లా ఈ సంఘటన గురించి మాట్లాడటానికి ఇష్టపడలేదు.ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో ఎవరికీ చెప్పలేదు.మళ్లీ అలా జరగకుండా ఏమైనా చేశారా అనేది కూడా చెప్పలేదు.టెస్లా ఎంప్లాయ్ పనిలో గాయపడడం ఇదే మొదటిసారి కాదు.ప్రభుత్వ రికార్డుల ప్రకారం, టెస్లా టెక్సాస్ ఫ్యాక్టరీలో ప్రతి 21 మంది వర్కర్స్‌లో ఒకరు గత సంవత్సరం గాయపడ్డారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube