Krishna, Vijaya Nirmala: కృష్ణ విజయనిర్మల రెండో పెళ్లికి కారణం ఆ స్టార్ హీరో నేనా..?

సూపర్ స్టార్ కృష్ణ విజయనిర్మల ( Krishna, Vijaya Nirmala ) ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే వీరిద్దరికీ ముందే పెళ్లిళ్లు జరిగాయి.

కృష్ణకి తన మేన మరదలు అయిన ఇందిరా దేవి ( Indira devi ) తో పెళ్లి జరిగింది.అలాగే విజయనిర్మలకి కూడా మొదట్లో పెళ్లి జరిగి ఇద్దరు కొడుకులు పుట్టారు.

ఇక సినిమాల మీద ఇంట్రెస్ట్ తో భర్తకు దూరంగా వచ్చేసి విజయనిర్మల సినిమాల్లో రాణించింది.అలా చేస్తున్న సమయంలో కృష్ణకి విజయనిర్మలకి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడి రెండో పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారట.

ఇక ఆ సమయంలో కృష్ణ తన మొదటి భార్య ఇందిరా దేవికి విడాకులు ఇవ్వాలి అనుకున్నప్పటికీ ఇందిరా దేవి మాత్రం ఇవ్వడానికి ఒప్పుకోలేదు.

Advertisement

అలా ఇద్దరు భార్యలతో కృష్ణ ఉన్నారు.ఇక కృష్ణ విజయనిర్మల పెళ్లి వెనుక ఓ స్టార్ హీరో హస్తం కూడా ఉందట.ఆయన ఎవరో కాదు తాజాగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన చంద్రమోహన్( Chandra mohan ) .ఈయన కృష్ణ విజయనిర్మల పెళ్లిలో అంతా తానే అయ్యి ముందుండి చేశారట.ఇక ఈ విషయాన్ని స్వయంగా చంద్రమోహన్ బతికున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.కృష్ణ విజయనిర్మల ది స్వచ్ఛమైన ప్రేమ.

వారిద్దరి పెళ్లిని ఆపడానికి ఇండస్ట్రీలో చాలామంది కుట్రలు చేశారు.

కానీ నేను,జర్నలిస్టు మోహన్ కుమార్, విజయ నిర్మల అసిస్టెంట్, కృష్ణ మేకప్ మాన్ మేము నలుగురం తిరుపతిలో కృష్ణ విజయనిర్మల పెళ్లి చేశాం.ఇక నాకు కృష్ణకి మధ్య మంచి అనుబంధం ఉంది.అంతే కాదు నాకు శోభన్ బాబు ( Sobhan babu ) అంటే కూడా చాలా ఇష్టం.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
ఆ మూవీ విషయంలో చేసిన తప్పే ఇప్పుడు చేస్తున్న నాని.. ఇంత నిడివి అవసరమా అంటూ?

మా ఇద్దరి మధ్య కూడా మంచి సంబంధం ఉండేది.ఇక కృష్ణ విజయనిర్మల పెళ్లి జరగడానికి నేను కూడా కారణం అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు.

Advertisement

అయితే కృష్ణకి మొదట పెళ్ళై పిల్లలు ఉండడంతో చాలామంది ఇండస్ట్రీ జనాలు ఆయనను తిట్టుకున్నారు.కానీ విజయనిర్మలపై కృష్ణ కి ఉన్న స్వచ్ఛమైన ప్రేమే వారిద్దరిని భార్యాభర్తలుగా చేసింది అంటూ చంద్రమోహన్ చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు