ఎన్నో వ్యయప్రయాసలుకోర్చి ఆఖరికి రాకెట్ ని నింగిలోకి పంపారు.అయితే అనూహ్యంగా ఆ రాకెట్ పేలిపోయింది.
కట్ చేస్తే ఆ రాకెట్ పంపించిన స్పేస్ కంపెనీ వాళ్లంతా నవ్వుతూ, కేరింతలు కొడుతూ చేసారు.ఆఖరికి వాళ్ళ వాళ్ల బాస్ తో సహా.అవును, ఎలన్ మస్క్( Elon Musk ) స్పేస్ ఎక్స్ సృష్టించిన సంచలనాల గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.అయితే ఇక్కడ నిన్న ఫెయిల్ అయిన స్టార్ ఫిష్ రాకెట్ అసలు లిఫ్ట్ ఆఫ్ అవడం ఎంత గొప్ప విషయమో ఇక్కడ చర్చించుకోవాలి.
రాకెట్ ప్రయోగాలనేవి ( Rocket launch )వేల కోట్ల వ్యయంతో కూడుకున్న వ్యవహారం.అన్ని కోట్లు ఖర్చుచేసి తయారు చేసిన రాకెట్ రీ యూజ్ చేయడం అనేది ఉండదు.అయితే అప్పటి వరకూ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన ఈ ఫీట్ ను నిజం చేసి చూపించారు ఎలన్ మస్క్.2002లో స్పేస్ ఎక్స్ అనే చిన్న సంస్థ స్థాపించి ఎప్పటికైనా ఓ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపించాలని కలలు కన్నాడు ఎలన్ మస్క్.కాగా నేడు 390 అడుగుల ఎత్తైన.5వేల మెట్రిక్ టన్నుల బాహుబలి రాకెట్ గాల్లో అమాంతం పేలిపోయినా కూడా మొహం మీద చిరనవ్వుని చెరగనివ్వలేదు ఎలన్ మస్క్.
అతని జర్నీ సో మచ్ ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటున్నారు ఇపుడు చాలామంది.ఇప్పుడు స్పేస్ ఎక్స్ ప్రయోగించే ఏ రాకెట్ అయినా రీ యూజబుల్ అని చెప్పుకోవచ్చు.అంటే గాల్లోకి వెళ్లి పోయిన తర్వాత దాని ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ విడి భాగం రాకెట్ ను అంతరిక్షంలో పంపించి మళ్లీ వచ్చి ఎక్కడైతే ప్రయోగం జరిగిందో అక్కడే వచ్చి అంటుకుంటుందన్నమాట.కాగా దీని ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు సేవ్ చేస్తున్నాడు ఎలన్ మస్క్.
ఇప్పుడు ఈ భారీ స్టార్ షిప్ ప్రయోగం కూడా వచ్చే 200-300 ఏళ్ల ఫ్యూచర్ స్పేస్ ఎక్స్ ప్లొరేషన్స్ ను, వాటి గమనాన్ని నిర్ణయించే ఓ అద్భుతమైన ప్రయోగం అని చెప్పుకోవచ్చు.