ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకాలు పొందిన పోలీసులు వీరే.. !

ప్రభుత్వ అధికారులకు ముఖ్యంగా మానవత్వం, మంచితం, నిజాయితీ అనే లక్షణాలు అత్యంత ప్రధానమైనవి.ఇలా ఉండే వారు సమాజంలో బహుశా చాల తక్కువ మంది.

 Police Man, Best Life, Protection Medals,  President Ramnath Kovind-TeluguStop.com

ఇక ఇలా వుండే వారు నలుగురికి తెలియాలంటే అలాంటి వారిని గుర్తించి, ప్రభుత్వం సరైన గౌరవం ఇస్తే మిగతా వారికి కూడా ఇలా ఉంటే ఎంత బాగుండు అని కొంతలో కొంత అయినా అనిపించవచ్చూ.ఇకపోతే దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది.

ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించేందుకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఇచ్చే జీవన్‌ రక్ష పతకాల ప్రదానానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు.ఇందులో ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకానికి ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి కూడా ఉన్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వం సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పతకం, ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకం, జీవన్‌ రక్ష పతకం మొదలగు పతకాలను ప్రదానం చేస్తోంది.కాగా 2020 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా మొత్తం 40 మందిని ఈ పతకాలకు ఎంపిక చేయగా, అందులో సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పతకాన్ని ఒకరు, ఉత్తమ్‌ జీవన్‌ రక్ష పతకాన్ని 8 మంది, జీవన్‌ రక్ష పతకాన్ని 31 మంది అందుకోనున్నారు.

వీరిలో కేరళకు చెందిన ముహమ్మద్‌ హుష్రీన్‌ కు సర్వోత్తమ్‌ జీవన్‌ రక్ష పతకాన్ని కేంద్రం ప్రకటించింది.అయితే ఇతను ఈ పతకం అందుకునే సమయానికి బ్రతికి లేకపోవడం విచారం.

వీరే కాకుండా పోలీస్ శాఖలోని ఇతర విభాగాల్లో పని చేస్తున్న మరికొందరికి కూడా ఈ పతకాలు అందిస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube