ఘోర ప్రమాదానికి గురైన విమానం.. షాకింగ్ వీడియో వైరల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరినీ షాక్ కి గురి చేస్తోంది.ఈ వీడియోలో ఒక చిన్న విమానం కార్లు, ట్రక్‌లు వెళ్తున్న బిజీ హైవేపై కుప్పకూలిపోయింది.

 The Plane That Had A Terrible Accident Shocking Video Viral Road Accident, Vira-TeluguStop.com

చాలా వేగంగా వచ్చి అది కుప్పకూలడంతో అందులో మంటలు ఉవ్వెత్తున ఎగిసాయి.మరుక్షణంలోనే ఆ విమానం అంతా కూడా మంటల్లో కాలిపోయి బూడిద అయింది.

ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.ఈ ఘటనకు సంబంధించిన వివరాలతో పాటు ఒక వీడియోని ‘ఏబీసీ న్యూస్’ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ షేర్ చేసింది.

ఆగస్టు 10న కొరోనాలోని లింక్లన్ అవెన్యూలో మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్న విమానం గాల్లో అడ్డదిడ్డంగా చక్కర్లు కొడుతూ కిందికి పడుతుండటం గమనించవచ్చు.

అయితే దీని కింద ఒక హైవే ఉండగా దానిపై చాలా వాహనాలు వెళుతున్నాయి.అదృష్టం కొద్దీ ఈ విమానం ఏ వాహనం పై కూడా పడకుండా సరిగ్గా హైవేపై ఖాళీ స్థలంలో పడిపోయింది.

ఆ తర్వాత అది గుండ్రంగా తిరుగుతూ హైవే పై నుంచి పక్కకు మళ్లింది.అనంతరం అందులో మంటలు చెలరేగాయి.ఆపై అది కాలిపోయింది.ఈ క్రమంలో ఏ వాహనాన్ని కూడా ఇది ఢీ కొట్టలేదు.

దీంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.అలానే విమానంలో ఉన్న పైలట్ ఆండ్రూ చో, మరో ప్యాసింజర్ సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డారు.

ఈ షాకింగ్ ఘటన గురించి తెలుసుకున్న వెంటనే కొరోనా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.అనంతరం మంటలను ఆర్పేశారు.

కొరోనా మునిసిపల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన విమానంలో పవర్ ఔటేజ్ సమస్య వచ్చిందని పైలట్ పేర్కొన్నాడు.దీంతో చేసేది లేక హైవే పై ల్యాండింగ్ చెయ్యాలని అనుకున్నానని అన్నాడు.కానీ వాహనాలతో రోడ్డు రద్దీగా ఉండడంతో చాలా భయపడ్డానని తెలిపాడు.ఆ భయంతోనే దానిని ఖాళీ సమయం చూసుకొని మరీ హైవేపై ల్యాండ్ చేసానని, ఆ వెంటనే పక్కకు తిప్పానని చెప్పాడు.

పైలట్ చాకచక్యంగా, తెలివిగా ప్రాణ నష్టాన్ని నిరోధించిన తీరును ఇప్పుడు నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube