వైరల్: నడి రోడ్డుపై కూలిన విమానం..

ప్రతిరోజు మనం ఏదో ఒక ప్రదేశంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండడం సంబంధించిన విషయాలను మనం మీడియా ద్వారా గమనిస్తూనే ఉంటాం.

ఈ రోడ్డు ప్రమాదాలలో చాలామంది చనిపోయి వారి కుటుంబాలు రోడ్డున పడిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి.

ఒక్కోసారి మనం ఎంత మంచిగా రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పటికీ.అవతల వారు వచ్చే తీరును బట్టి ఒక్కోసారి మన మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది.

ఇలాంటి ఘటనలకు సంబంధించి అనేక వీడియోలు నెత్తిన చాలానే చూసాము.అయితే తాజాగా ఫ్రాన్స్( France ) రాజధాని పారిస్ రోడ్డుపై ఒక విమానం కూలింది.

ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

Advertisement

ఫ్రాన్స్ దేశ రాజధాని పారిస్ డిస్నీల్యాండ్( Paris Disneyland ) సమీపంలో ఏ4 మోటార్ వే పై ఒక్కసారిగా విమానం కుప్పకూలిపోయింది.ఆ విమానం తలకిందుగా రోడ్డుపై పడడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.ఇక సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే పోలీసులతో కలిసి అక్కడకు చేరుకొని గయాలు పాలైన వారిని ఎయిర్ అంబులెన్స్( Air Ambulance ) లో హాస్పిటల్ కు తరలించారు.

ఇక ఈ ప్రమాదంతో రోడ్డు పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి అధిక సంఖ్యలో వాహనాలు రోడ్డు పైన నిలిచిపోయాయి.

ఈ ఘటనకు ముందు తక్కువ ఎత్తులో ఆ విమానం ఎగురుతుండడంతో ఓ విద్యుత్ తీగ తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.ఈ ప్రమాదంపై ఆ దేశ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ విచారణ జరుపుతుందని సమాచారం.ఈ ఘోర ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆల్ టైం ఫేవరెట్ ఫోటో అంటూ అలాంటి ఫోటో షేర్ చేసిన నాగ్ అశ్విన్?
Advertisement

తాజా వార్తలు