అందరినీ ఆకర్షిస్తున్న పెన్ను.. ధర అక్షరాలా రూ.11 లక్షలు!

సాధారణంగా విద్యార్థులు రూ.10 నుంచి రూ.20 మధ్య ధర ఉండే పెన్నులను వాడుతుంటారు.

అధికారి హోదాలో ఉన్నవారు, పెన్నులపై మక్కువ ఉన్న వారు వందల రూపాయలు వెచ్చించి కొన్ని పెన్నులు వాడుతుంటారు.

బాల్ పెన్‌లే కాకుండా ఇంక్ పెన్నులను స్టైలిష్‌గా ఉంటాయని వాటిని వినియోగిస్తుంటారు.ఇక చాలా మందికి టేబుల్‌పై పెన్ను స్టాండు ఉంటుంది.అది ఆకర్షణీయంగా, వివిధ రకాల పెన్నులతో చూడముచ్చటగా కనిపిస్తుంటుంది.

ఎంత ఇష్టం ఉన్నా ఎవరైనా వందల రూపాయల పెన్నుల కంటే మించి వాడరు.బాగా డబ్బున్న వారైతే వేల రూపాయలు ఉంటే కొన్ని పెన్నులును తమ జేబులో పెట్టుకోవడానికి ఇష్టపడుతుంటారు.

అయితే మీరు ఎప్పుడైనా రూ.లక్ష ధర ఉన్న పెన్ను ఉందని విన్నారా.అయితే ఇది నిజమే.ఏకంగా రూ.11 లక్షల ధర ఉన్న పెన్నును చూసి అంతా అవాక్కవుతున్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Advertisement

రాజస్థాన్‌లోని జైపూర్‌ నగరంలో ఇంటర్నేషనల్ జమ్ జ్యువెలరీ షో ఇటీవల వైభవంగా నిర్వహించారు.ఈ సారి ప్రదర్శనలో కొన్నింటికి ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

ఎగ్జిబిషన్‌లో పెట్టిన ఓ పెన్ను గురించి అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు.అలా చర్చించుకోవడానికి కారణం కూడా ఉంది.

దాని ధరే ఆ పెన్నుకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.దానికి ఏకంగా రూ.11 లక్షలుగా పెట్టడం చర్చనీయాంశంగా మారింది.హార్ప్ ఆకారంలో ఉంటే ఈ పెన్నును చాలా కష్టపడి తయారు చేశారు.22 క్యారెట్ల మేలిమి బంగారంతో రూపొందించారు. డైమండ్స్, ఎమరాల్డ్ పూసలు, వివిధ రకాల అరుదైన జాతి రాళ్లను ఈ పెన్నుకు పొదిగారు.

చూడగానే ఎంతో ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించారు.ఈ ఎగ్జిబిషన్‌ను జైపూర్‌లో మే 12 వరకు నిర్వహించారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

దీనిని చూసేందుకు 48 దేశాల నుంచి 8 వేలకు పైగా సందర్శకులు వచ్చారు.వచ్చిన వారంతా ఈ పెన్నును చూసి ఎంతో ముచ్చట పడ్డారు.

Advertisement

ఈ ప్రత్యేక పెన్నును చూసేందుకు ఆసక్తి చూపించారు.

తాజా వార్తలు