పాత బస్సులో సరికొత్త రెస్టారెంట్.. క్యూ కడుతున్న జనం!

ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే పెట్టుబడితో పాటు దానిని నష్టం రాకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రణాళిక అవసరం.వినూత్నంగా ఆలోచిస్తూ, కస్టమర్లను ఆకట్టుకోవాల్సి ఉంటుంది.

ఇదే ముగ్గురు యువకుల వ్యాపార రహస్యం అయింది.కరోనా వల్ల లాక్‌డౌన్ పెట్టినప్పుడు ఓ ముగ్గురు వ్యక్తుల మదిలో మెరుపులాంటి ఆలోచన తట్టింది.

The Newest Restaurant On The Old Bus Old Bus, Resturant, Viral Latest, Viral Ne

అనుకున్నదే తడవుగా వారు ఓ పాత బస్సును కొనుగోలు చేసి, దానికి సరికొత్త సొబగులు అద్దారు.ఆ తర్వాత తమ మనసులోని డైన్ ఆన్ బస్ రెస్టారెంట్‌కు రూపం తీసుకొచ్చారు.

ప్రారంభించిన కొన్నాళ్లకే వారి ప్రయత్నం విజయవంతం అయింది.కస్టమర్లు పెద్ద ఎత్తున వస్తుండడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.

Advertisement

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.కర్నూలుకు చెందిన శేఖర్ టాటా కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

అతని స్నేహితుడు వినయ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్.శేఖర్ తమ్ముడు శ్రీకాంత్ కర్నూలులో ఉండేవాడు.

ఈ ముగ్గురికీ కరోనా లాక్‌డౌన్ సమయంలో ఏదైనా రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది.దీంతో డైన్ ఆన్ బస్‌ పేరిట రెస్టారెంట్ పెడదామని అనుకున్నారు.

దీంతో ఓ పాత లగ్జరీ బస్సును కొనుగోలు చేశారు.దానిని వ్యాపారానికి తగ్గట్టు మార్చుకున్నారు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

అలా వారి థీమ్ రెస్టారెంట్ డైన్ ఆన్ బస్‌కు రూపకల్పన జరిగింది.దీనిని ప్రారంభించిన మొదట్లో వెజ్ ఐటమ్స్ మాత్రమే అందించే వారు.

Advertisement

కొన్నాళ్లకు నాన్ వెజ్ పదార్థాలు కూడా పెట్టడంతో విపరీతంగా ప్రజాదరణ పెరిగింది.దీంతో రోజూ ఆ రెస్టారెంట్‌కు చాలా మంది క్యూ కడుతున్నారు.

ఆ బస్సుకు రెండు కంటైనర్లను జోడించారు.అందులో 64 మంది వరకు కూర్చోవచ్చు.

రాత్రిపూట చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, భోజనం చేసేందుకు చాలా మంది అక్కడకు వస్తున్నారు.వ్యాపారం బాగుండడంతో టిఫిన్లు, ఐస్ క్రీమ్ పార్లర్ కూడా తెరిచారు.

ఎన్ని ఎలా ఉన్నా, ఆహారం టేస్ట్‌గా ఉంటేనే కస్టమర్లు వస్తారు.దీనిని దృష్టిలో పెట్టుకున్న నిర్వాహకులు ఈ విషయంలో రాజీ పడలేదు.

రుచికరమైన వివిధ ఆహార పదార్థాలను అందిస్తున్నారు.దీంతో ఎక్కువ మంది వీరి థీమ్ రెస్టారెంట్ వచ్చి, తమకు నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ, తింటున్నారు.

తాజా వార్తలు