చలికాలం వెచ్చదనం కోసం స్వీట్, హాట్ డ్రింక్స్ మనం కోరుకుంటాం.చాలా మంది ఇండియన్లకు, గులాబ్ జామూన్( Gulab Jamun ) అంటే చాలా ఇష్టం, మరికొందరు వేడి వేడి కాఫీ కోసం ట్రెండీ కేఫ్‌ని సందర్శించడానికి ఇష్టపడతారు.
ఈ రెండు విభిన్న రుచులను ఒక ప్రత్యేకమైన డ్రింక్ గా కలిపితే ఎలా ఉంటుంది? అస్సలు ఆ ఆలోచనే తట్టులేదు కదూ.నిజానికి ఈ రెండు ఫుడ్స్ కంబైన్ చేయాలని ఇండియాలో ఏ వంటగాళ్లు అనుకోలేదు.కానీ న్యూయార్క్ రెస్టారెంట్ ఈ ఆలోచన చేసింది.కోల్‌కతా చాయ్ కో, గులాబ్ జామూన్ లట్టేని ఇది మిక్స్ చేసి గులాబ్ జామూన్ కాఫీ తయారు చేసింది.

కోల్‌కతా చాయ్ కో( Kolkata Chai Co ) అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వినూత్న డ్రింక్ పరిచయం చేశారు.గులాబ్ జామున్ లట్టే వీడియో, ఫోటోలను పోస్ట్ చేశారు.న్యూయార్క్ రెస్టారెంట్ వేర్వేరు ప్రాధాన్యతలకు అనుగుణంగా లట్టేని హాట్, కోల్డ్ వెర్షన్‌లుగా అందిస్తారు.ఆన్‌లైన్ కమ్యూనిటీ ఈ కొత్త ఫుడ్ క్రియేషన్ సందడి చేస్తోంది.దీనిని ట్రై చేయాలని ఉందని, టేస్ట్ బాగుంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానని అన్నారు.ఇండియన్ కాంబో డ్రింక్ న్యూయార్క్‌లో తయారు కావడం హ్యాపీగా ఉందని ఇంకొందరు అన్నారు.

గులాబ్ జామూన్లను క్రియేటివ్ వంటగా మార్చిన రెస్టారంట్ న్యూయార్క్( New York )లో ఒక్కటే కాదు.గతంలో అహ్మదాబాద్‌కు చెందిన ఓ స్వీట్ షాప్ గులాబ్ జామూన్ డోనట్స్ చేసి ఆశ్చర్యపరిచింది.ఈ డోనట్స్‌ను గులాబ్ జామూన్‌లను పోలి ఉండేలా తయారు చేశారు.వీటిలో క్రీమ్, కుంకుమపువ్వు, గులాబీ రేకులు, పిస్తాపప్పులు జోడించారు.అది చూసేందుకు సూపర్ అట్రాక్టివ్ గా ఉండి చాలామందిని ఆకర్షించింది.గులాబ్ జామున్‌కు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోపై మీరు కూడా ఒక లుక్కేయండి.







