సిగరెట్‌ తాగాలంటే ఇకపై వందేళ్లు నిండాలట, మంచి నిర్ణయమే కాని..!

సిగరెట్‌ వల్ల క్యాన్సర్‌ వస్తుందనే విషయం అందరికి తెలుసు.అయినా కూడా ఎన్నో కోట్ల మంది ప్రతి రోజు సిగరెట్లను కాల్చుతూనే ఉన్నారు.

సిగరెట్లను కొన్ని దేశాలు బ్యాన్‌ చేసినా కూడా కొన్ని దేశాల్లో వాటిని బ్యాన్‌ చేసేందుకు ప్రభుత్వాలు సాహసం చేయడం లేదు.సిగరెట్‌ కంపెనీలు మరియు ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశ్యంతో సిగరెట్‌ తాగే వారిని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూనే ఉన్నాయి.

ప్రపంచం మొత్తం కూడా సిగరెట్‌పై వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది.మన ఇండియాలో సిగరెట్‌ను మాన్పించేందుకు సిగర్‌ డబ్బాలపై క్యాన్సర్‌ వ్యాదిగ్రస్తుల ఫొటోలను వేస్తున్న విషయం తెల్సిందే.

మన వద్ద ఆ ఫొటోలు పెద్దగా ఫలితాన్ని చూపడం లేదు.

Advertisement

అమెరికాలోని హవాయ్‌లో సిగరెట్లను బ్యాన్‌ చేసేందుకు స్థానిక ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది.హవాయ్‌లో త్వరలో వంద ఏళ్లు పైబడిన వారుమాత్రమే సిగరెట్లు తాగాలనే నిబంధన తీసుకు రాబోతున్నారు.అయితే ఈ నిబంధనను వెంటనే అమలు చేయకుండా మెల్ల మెల్లగా దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించారు.అందుకు సంబంధించిన రూల్‌ కూడా అక్కడ వచ్చింది.2020 సంవత్సరం తర్వాత 30 ఏళ్ల లోపు వారికి సిగరెట్లు అమ్మ కూడదు అనే నిబందన తీసుకురాబోతున్నారు.ఆ తర్వాత 40 ఏళ్ల వయసు వారికి, ఆ తర్వాత 50 ఏళ్ల లోపు వారికి సిగరెట్లు అమ్మకూడదు అనే నిర్ణయానికి హవాయి అధికారులు వచ్చారు.

దశల వారిగా 2025 సంవత్సరం తర్వాత 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే సిగరెట్లు అమ్మాలనే రూలు తీసుకు వచ్చారు.అంటే హవాయి రాష్ట్రంలో ఉండే వారు 100 ఏళ్లు పూర్తి అయిన తర్వాతే సిగరెట్లు తాగాల్సి ఉంటుందన్నమాట.అంటే 100 ఏళ్లు పూర్తి అయిన వారు సిగరెట్లు తాగినా ఎలాంటి సమస్య ఉండదు అనేది అక్కడి ప్రభుత్వం అభిప్రాయం కావచ్చు.

అందుకే ఈ నిర్ణయం తీసుకుంది.అయితే స్థానికులు మాత్రం అక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.కొందరు మాత్రం హవాయి రాష్ట్రం తీసుకున్నది మంచి నిర్ణయమే కాని, 100 ఏళ్లు కాకుండా 60 ఏళ్లు అని వయసు నిబందన ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.2024 వరకు ఈ నిబందన కొనసాగి 100 ఏళ్ల వారికి సిగరెట్లు అమ్మకుండా ఉంటారేమో చూడాలి.

అమెరికన్ వర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు .. అన్నింటికీ బైడెనే కారణం : డొనాల్డ్ ట్రంప్

Advertisement

తాజా వార్తలు