జూన్ 17 న "యు ఆర్ మై హీరో" చిత్ర ట్రైలర్ విడుదల

ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణ లో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై ఫిరోజ్ ఖాన్‌,సనా ఖాన్‌, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజీ, మేకా రామకృష్ణ,అనంత్ నటీ నటులుగా షేర్ దర్శకత్వంలో మిన్ని నిర్మిస్తున్న ,హార్రర్, సస్పెన్స్ యాక్షన్ రొమాంటిక్ థ్రిల్లర్ “యు ఆర్ మై హీరో ” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17 న విడుదల అవుతున్న సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్,బాలీవుడ్ విలన్ మిలింద్ గునాజీ లు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

 The Movie Trailer For You Are My Hero Was Released On June 17 , You Are My Hero-TeluguStop.com

అనంతరం తెలంగాణ

ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ

.”యు ఆర్ మై హీరో” చిత్రం ట్రైలర్ చాలా బాగుంది.చక్కటి కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వ బోతున్నాము.

సస్పెన్స్,థ్రిల్లర్, రొమాంటిక్ ఫ్యామిలి ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలోని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి .ప్రతి ఒక్క ఆడియన్స్ కు ఈ చిత్రం తప్పక నచ్చుతుందనే నమ్మకం ఉందని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అన్నారు.

బాలీవుడ్ విలన్ మిలింద్ గునాజీ మాట్లాడుతూ.

నా చేత యు ఆర్ మై హీరో” చిత్రం ట్రైలర్ ను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ఇప్పటి వరకు బాలీవుడ్ లో విలన్ గా నటించిన నేను మొదటిసారిగా మంచి కాన్సెప్ట్ ఉన్న తెలుగు సినిమాలో విలన్ గా నటిస్తున్నాను.ఈ నెల 17 వస్తున్న ఈ సినిమా మా టీం అందరికీ మంచి పేరు రావాలని అన్నారు.

చిత్ర నిర్మాత మిన్ని మాట్లాడుతూ.

హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా మూవీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “యు ఆర్ మై హీరో ” చిత్రాన్ని గోవాలోని పలు అందమైన లొకేషన్స్ లతో పాటు హైదరాబాదు లోని అనేక ప్రదేశాలలో ఈ సినిమా షూటింగ్ చేశాము.ఈ సినిమాకు అందమైన పాటలు, ఫైట్లు అన్నీ సినిమాకు చక్కగా కుదిరాయి.

మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు మంచి ఔట్ ఫుట్ వచ్చింది.ఈ చిత్రంలో .ఫ్యామిలీ అందరూ కలసి చూసే విధంగా తీసిన ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఒక మంచి మెసేజ్ ఇవ్వ బోతున్నాము.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 17 న విడుదల అవుతున్న “యు ఆర్ మై హీరో” చిత్రం ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు

చిత్ర దర్శకుడు షేర్ మాట్లాడుతూ.

.పోలీస్ ఆఫీసర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న సినిమా కథ విషయానికి వస్తే.

ఒక పెద్ద మాఫియాను అంతం చేసే క్రమంలో హీరో, హీరోయిన్లు చంపబడతారు.చనిపోయిన తరువాత వారు గోస్ట్ లు గా మారి తమను చంపిన వారిపై ఎలా రివెంజ్ తీర్చుకున్నారు అనే ఆసక్తికరమైన కథాంశంపై ఈ సినిమా నడుస్తుంది.

నిర్మాతల సహకారం వల్లే ఈ చిత్రం ఇంతబాగా వచ్చింది అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube