సోషల్ మీడియాలో ఈమధ్య వైరల్ అవుతున్న వీడియోలలో పులులు, సింహాలకు సంబందించిన వీడియోలకు క్రేజ్ బాగా పెరిగిపోతోంది.నెట్టింట జనాలు వాటినే ఎక్కువగా చూస్తున్నారు.
ఇక తాజాగా అవుతున్న వీడియో చూస్తే.నిద్రపోతున్న పులిని లేపితే ఎలా ఉంటుంది అనేది చాలా బాగా అర్ధం అవుతుంది.
అవును, పులులు బేసిగ్గా రాత్రిపూటే వేటాడుతుంటాయి.కారణం ఇవి నిశాచర జీవులు.
పగలు మాత్రం హాయిగా పడుకుంటాయి.పులులు రోజుకు 18-20 గంటలు పడుకుంటాయని చెబుతారు.
పులులు ఒంటరిగానే వేటాడుతాయి.ఆడ పులులు మాత్రం పిల్లలతో కలిసి వేటాడుతాయి అన్న సంగతి చాలా కొద్దిమందికి తెలుసు.ఎందుకంటే పిల్లలకు వేట నేర్పడం, తద్వారా తమ ఆహారాన్ని తామే ఎలా సాధించుకోవాలో ఆడ పులులు అంటే తల్లి పులులు నేర్పిస్తాయి.అందుకే సమయం ఉన్నప్పుడు కాస్త నిద్రపోవడం ద్వారా అవి ఎనర్జీ సంపాదించుకుంటాయి.
అయితే ఈ వ్యవహారమంతా పాపం ఆ పిల్ల పులికి ఏమాత్రం తెలియదు.తల్లికి నిద్ర ఎంత అవసరమో దానికి పాపం ఏం తెలుసు? తెలియక తల్లి నిద్రను డిస్ట్రబ్ చేసేసింది.
ఇక అంతే.ఒక్కసారిగా నిద్రలేచిన తల్లికి బాగా చిరాకేసిందేమో.కోపంతో పిల్ల పులిపై పంజా విసిరింది.బేసిగ్గా వాటి పిల్లలకు వాటికి మధ్య విడదీయలేని బంధం ఉంటుంది.కానీ నిద్ర డిస్ట్రబ్ చేస్తే ఎలా అని అనుకుందేమో గాని, దానికి సరైన బుద్ధి చెప్పింది.పాపం ఆ పిల్ల పులి చేసేది లేక వెనుకంజ వేయకతప్పలేదు.అయితే ఇదంతా ఓ జూలో జరిగిన ఘటన.ఆ 2 పులుల దెబ్బలాటను గ్లాస్‌లోంచి చూస్తున్న ఓ చిన్నారి ఒక్కసారిగా భయపడిపోయాడు.వీడియోలో ఇదంతా స్పష్టంగా చూడొచ్చు.