దేశంలో మళ్ళీ కరోనా పడగా విప్పిన సంగతి తెలిసిందే.మార్చి నెలలో తగ్గుముఖం పట్టిన కరోనా మళ్ళీ ఇప్పుడు విజృంభిస్తోంది.
ముఖ్యంగా చైనా దేశాన్ని గజగజలాడిస్తున్న “బీఎఫ్ 7” అనే కొత్త వేరియంట్ ఇప్పుడు భారత్ లో కూడా వెలుగులో చూడడం జరిగింది.గుజరాత్ .ఒడిశా రాష్ట్రాలలో ఈ వేరియంట్ కొత్త కేసులు వెలుగులోకి రావడంతో.కేంద్రం అప్రమత్తమయ్యింది.
ఈ క్రమంలో ప్రధాని మోడీ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి దేశంలో పరిస్థితులను సమీక్షించారు.
ఇదిలా ఉంటే ఈరోజు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని కూడా పాల్గొనడం జరిగింది.విశాఖ నుంచి వర్చువల్ గా విడుదల రజిని.
పాల్గొని రాష్ట్రంలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రస్తుతం 47 వేల వ్యాక్సిన్ డోస్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని రెండు మూడు రోజుల్లో వ్యాక్సిన్ లు నిల్వలు అయిపోతాయని పేర్కొన్నారు.
దీంతో వెంటనే రాష్ట్రానికి అత్యవసరంగా వ్యాక్సిన్ లు పంపించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.