చలికి వణుకుతున్న కుక్కలకు దుప్పటి కప్పిన వ్యక్తి.. నెటిజన్లు ఫిదా..

కూడు, గుడ్డ, నీడ లేని జంతువులు ఎన్నో అవస్థలు పడుతుంటాయి.ముఖ్యంగా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో జీవులు బయటే పడుకొని అరకయాతన అనుభవిస్తాయి.

ఒక్కోసారి ఆ వాతావరణానికి తట్టుకోలేక మరణిస్తుంటాయి.అయితే కొందరు మాత్రం వాటిని చూసి బాగా ఫీల్ అయిపోయి తమకు చేతనేనంత సహాయం చేస్తారు.

ఆ చిన్ని సహాయంతో వాటి ప్రాణాలను కాపాడుతారు.ఈ కోవకు చెందిన ఒక వ్యక్తి వీడియో తాజాగా సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

@_B___S ట్విట్టర్ పేజీ ( Twitter )షేర్ చేసిన వీడియోలు రెండు కుక్కలు బయట చలికి వణుకుతూ పడుకోవడం మనం చూడవచ్చు.అయితే ఈ రెండింటినీ గమనించిన ఒక వ్యక్తి ఒక మందపాటి రగ్గును వాటిపై కప్పుతూ కనిపించారు.ఆ సమయంలో కుక్కలు చాలా సంతోషించాలి.

Advertisement

ఆ వ్యక్తి మూతిని ఒక కుక్క నాకింది.రగ్గు కప్పాక అవి చాలా హాయిగా పడుకున్నాయి.

ఈ మూగజీవుల బాధ అర్థం చేసుకుని అవి సుఖంగా పడుకునేలా హెల్ప్ చేసిన ఈ వ్యక్తిని చాలామంది పొగుడుతున్నారు.అందరూ కూడా తమకు సమీపంలో ఉన్న మూగ జంతువులకు ఇలానే సహాయం చేయాలని కోరారు.

కుక్కలు( Dogs ) మనుషులకు బెస్ట్ ఫ్రెండ్స్ అని వాడిని మనం కాపాడుకోవాలని కొందరు కామెంట్స్ పెట్టారు.దట్స్‌ సో లవ్లీ మూగజీవుల పట్ల ప్రతి ఒక్కరూ దయ చూపించాలని ఇంకొందరు అన్నారు.1,30,000కు పైగా వ్యూస్ వచ్చిన ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.https://twitter.com/_B___S/status/1729982323951853572?t=eSRC1icE_0FBQ6_mJ6wRxg&s=19 ఈ లింకు పై క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ వీడియోను చూడవచ్చు.

పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్
Advertisement

తాజా వార్తలు