అమెరికాలో విషాదంగా ముగిసిన తెలుగు విద్యార్ధి జీవితం...!!!

అమెరికా వెళ్లి ఉన్నత చదువు చదువుకుని ఆర్ధికంగా స్థిరపడి అమ్మను కంటికి రెప్పలా చూసుకోవాలని అనుకున్న ఓ కొడుకును ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే నా కళ్ళ ముందే ఉండమంటూ తల్లి వారించింది.కానీ చివరికి కొడుకు ఇష్టప్రకారమే ఇష్టం లేకపోయినా అమెరికా చదువుకోసం రెండు నెలల క్రితం పంపింది.

 The Life Of A Telugu Student  Ended Tragically In America , Telugu Student , Ame-TeluguStop.com

కానీ ఆమె ఆందోళన చెందినట్టుగానే, భయపడినట్టుగానే జరగరాని ఘోరం జరిగిపోయింది.ఊహించని విధంగా తన కొడుకు మృతి చెందడంతో ఇంకెవరి కోసం తాను బ్రతకాలంటూ గుండెలు అవిసేలా రోదిస్తోంది.

వివరాలలోకి వెళ్తే.

ఏపీ లోని ఒంగోలు జిల్లాకు చెందిన దొండపాటి కార్తీక్ తన బీటెక్ మొత్తం ఒంగోలు లోనే పూర్తి చేశాడు.

చదువుల్లో ఎప్పుడూ ముందుండే అతడు ఉన్నత చదువుకోసం అమెరికా వెళ్లి చదువుకోవాలని భావించాడు.రెండు నెలల క్రితమే అమెరికా వెళ్లి అక్కడి చికాగో స్టేట్ లేవిస్ వర్సిటిలో చేరిన కార్తీక్ ఊహించని విధంగా ఫిట్స్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

రెండేళ్ళ లో తిరిగి వచ్చేస్తానని చెప్పిన కొడుకు ఇప్పుడు శవమై పోయాడని కార్తీక్ తల్లి కన్నీరు మున్నీరు అవుతోంది.తనను విడిచి వెళ్ళవద్దని, ఇక్కడే ఉండి చదువుకోమని చెప్పానని కానీ తన ఇష్టప్రకారం అమెరికా పంపానని రోదిస్తూ చెప్తున్నా మాటలు అందరిని కంట తడి పెట్టించాయి.ఇదిలాఉంటే

Telugu America, Chicago Louis, Ongole, Telugu Nri, Telugu-Telugu NRI

15 ఏళ్ళ క్రితం తన చిన్న కొడుకు కూడా కార్తీక్ మృతి చెందిన రోజునే మరణించడం ఆమెను మరింత బాధకు గురిచేస్తోంది.చిన్న కొడుకు మృతి తరువాత ఆమె భర్త ఐదేళ్ళ క్రితం మృతి చెందారని ఇక ఒక్కగానొక్క కొడుకు కార్తీక్ మిగలగా అతడు కూడా మృతి చెందటంతో ఆమె తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.ఇదిలాఉంటే కార్తీక్ మృత దేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి అక్కడి తెలుగు సంఘం తానా కృషి చేస్తోంది.త్వరలో కార్తీక్ దేహాన్ని వారి కుటుంభ సభ్యులకు అందజేస్తామని తానా సభ్యులు ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube