ఈ రోజుల్లో మనుషులు అడవుల్లో తిరుగుతూ అక్కడ నివసిస్తున్న జంతువులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.కొందరు ప్రజలు వాటి ఆవాసాలను తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు.
దీని వల్ల అక్కడ నివసించే జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి.మరికొన్ని జంతువులు ఆహారం వెతుక్కుంటూ జనాలు తిరిగే ప్రాంతాల్లోకి తరలి వస్తున్నాయి.
భారతదేశంలో ముఖ్యంగా బెంగళూరు, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల్లో చిరుతపులులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అయితే తాజాగా బెంగళూరులో ఒక చిరుతపులి ఏకంగా రైలు ఎక్కింది.
అయితే అది ఒక గూడ్స్ ట్రైన్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది.ఈ గూడ్స్ ట్రైన్ లోకి ఎక్కిన చిరుత అందులో మలవిసర్జన చేసింది.
ఈ మలవిసర్జన ఒక ఆడ చిరుత పులిది అని అధికారులు గుర్తించారు.గూడ్స్ రైలు ఎక్కిన తర్వాత చిరుత రైల్ వీల్ ఫ్యాక్టరీ క్యాంపస్ లో దిగింది.
అక్కడ దిగిన చిరుతపులి ఇప్పుడు ఆ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.అందుకే ఈ ప్రాంత ప్రజలు ఒంటరిగా బయటకు రావొద్దని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
రాత్రి సమయంలో టార్చ్ లేకుండా ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావద్దని వార్నింగ్ ఇస్తున్నారు.
సాధారణంగా ఏదైనా రిపేర్లు ఉన్న రెగ్యులర్ ట్రైన్ లు, గూడ్స్ ట్రైన్ లు రైల్ వీల్ ఫ్యాక్టరీ క్యాంపస్ కు వస్తుంటాయి.
ఈ క్రమంలోనే ఇటీవల ఒక గూడ్స్ ట్రైన్ అక్కడ దాక వచ్చింది.ఇందులోనే పులి దాక్కొని క్యాంపస్ లో ఎంట్రీ ఇచ్చింది.
దీన్ని పట్టుకోవడానికి అధికారులు ఒక ట్రాప్ కూడా సెటప్ చేశారు.మార్చి 27వ తేదీన ఇది క్యాంపస్ ప్లేస్ లో తిరుగుతూ కనిపించింది.
దీంతో ఎవరికీ హాని జరగకముందే దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.ఒక బోనులో మాంసం ఉంచి అందులో దాన్ని బంధించాలని ఇప్పటికే ఒక సెటప్ ఏర్పాటు చేశారు.
అలాగే ఒక బతికున్న మేకను ఎరగా అదే ప్రాంతంలో ఉంచారు.