ఒక చిన్న సినిమా 200 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మాములు విషయం కాదు.అయితే ఆ సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం ఈ రోజుల్లో అది సాధ్యం అయ్యే పనే.
ఎందుకంటే ఆడియెన్స్ వైఖరిలో మార్పు రావడంతో కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరించడం స్టార్ట్ చేసారు.ఇక తాజాగా ఒక సినిమా చిన్న సినిమాగా వచ్చి ఏకంగా 200 కోట్లు కలెక్ట్( 200 Crore collection ) చేసింది.ఆ సినిమా ఏంటా అని ఆలోచిస్తున్నారా.‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story).ఈ సినిమా ఎన్ని వివాదాలతో రిలీజ్ అయ్యిందో అందరికి తెలుసు.ఈ వివాదాలే ఈ సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పాలి.
గత కొన్నాళ్లుగా కేరళ (Kerala) లో అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజం లోకి తీసుకు వెళ్తున్నారు అని బహిరంగంగానే ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.
మరి ఇదే నేపథ్యంలో కథను ను తీసుకుని డైరెక్టర్ సినిమాగా తెరకెక్కించాడు.కాంట్రవర్సీ కారణంగా సినిమా కలెక్షన్స్ అమాంతం రెట్టింపు అయ్యాయి.పది రోజుల్లోనే 136.7 కోట్ల రుపాయల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరబోతోంది.మరో అడుగు దూరంలోనే ఉంది.నిన్నటి కలెక్షన్స్ తో కలిపి 198.97 కోట్ల రూపాయలు రాగా.ఈ రోజు 200 కోట్ల మార్క్ ఈజీగా టచ్ చేసే అవకాశం ఉంది.ఇక ఈ సినిమా ఇంకా లాంగ్ రన్ కొనసాగిస్తూనే ఉంది.దీంతో మరిన్ని మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది.దీంతో ఈ సినిమా సరికొత్త సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది.