తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తుండగా మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ నీరు లేక వెలవెలబోతుంది.వరప్రదాయినీగా పేరుగాంచిన జూరాల ప్రాజెక్ట్ నీరు లేక ఎడారిలా దర్శనమిస్తుంది.
కృష్ణానదికి వరద లేకపోవడంతో పాటు నారాయణ ప్రాజెక్ట్ నుంచి నీరు రాకపోవడంతో జూరాలలో నీటి నిల్వ తగ్గిపోయిందని తెలుస్తోంది.అటు నెట్టెంపాడు,బీమా ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి ఉందని సమాచారం.







