నకిరేకల్ లో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన గడ్డ నల్గొండని తెలిపారు.
రజాకార్ల నుంచి ప్రజలకు విముక్తి కలిగించింది నల్గొండ వీరులేనన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.తెలంగాణ కోసం కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని సైతం వదులుకున్నారని తెలిపారు.
పార్టీ ఫిరాయించిన 12 మందిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వకూడదన్నారు.ఈ క్రమంలో నకిరేకల్ ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోవాలని తెలిపారు.