ఎన్నికలు పూర్తయ్యాక విశాఖ నుండి ప్రమాణస్వీకారం, పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణం.జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy )కి దమ్ముంటే మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టో( YCP Manifesto )లో పెట్టాలి.
ఇప్పటికే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు.అమరావతి రాజధా( Amaravati )ని కోసం 33వేల ఎకరాలు భూమినిచ్చిన రైతులను నట్టేట ముంచారు.
కర్నూల్లో న్యాయ రాజధాని కోసం కేంద్రానికి కనీసం ఒక లేఖ కూడా వ్రాయకుండా రాయలసీమ ప్రజలను మోసం చేశారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ( Vizag Steel Plant Privatization )పై జగన్ కనీసం నోరు మెదపడం లేదు.
విశాఖలో భూకబ్జాలు ,దందాలు కొనసాగుతున్న వాటిపై ఎటువంటి చర్యలు లేకపోయాయి.జగన్ విశాఖ రాజధాని వ్యాఖ్యలు మరో మారు రాష్ట్ర ప్రజలను మోసగించటమే.