ప్రపంచంలోనే ఎత్తైన శివాలయం..మహా శివుడి భాగాలు పడిన ప్రదేశం..

ప్రకృతి ఒడిలో పరమేశ్వరుడిని దర్శించుకునే భాగ్యం హిమాలయ పర్వతం కల్పిస్తూ ఉంది.అత్యంత సహస్రపేతమైన యాత్ర ఇది.

అందుకే సంసారబంధాల నుంచి విముక్తి కావాలనుకునే వారికి హిమాలయాల్లో కొలువుతీరిన శంకరుడిని దర్శించుకోవాలని కోరిక ఉంటుంది.అలాంటి ఆలయాలలోనే ఒకటి తుంగనాథ్ ఆలయం.

హిమాలయాల్లోని తుంగనాథ్ పర్వతశ్రేణులలో భాగంగా చంద్రశీల అనే ఎత్తైన కొండ ఒకటి ఉంది.అయితే ఈ కొండమీద నుంచి చూస్తే నలువైపులా మంచు పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి.

అయితే అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో చూసి చంద్రుడు పరవశించిపోయాడట.ఆ పరవశంలోనే సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోయారు.

Advertisement

అందువలన ఆ పర్వతానికి చంద్రశీల అనే పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు.అయితే పంచకేదరార క్షేత్రాల్లో ఒకటి తుంగనాథ్.

ఈ ఆలయం ఏర్పడడం వెనుక ఓ గాథ ఉంది.

అయితే కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు బ్రహ్మహత్యాపాతకం, దయాతులు, బంధువులను చంపి పాపాన్ని పోగొట్టుకోవాలని శివుడు దర్శనానికి వెళ్లారు.అయితే భోళాశంకరుడు మాత్రం పాండవులను తన దర్శన భాగ్యం కల్పించలేదు.కాశిని వదిలేసి ఉత్తరాదిశగా హిమాలయాలకు వెళ్లిపోయారు.

అయితే పట్టువదలని ఆ పాండవులు శివుడి దర్శనార్థం కోసం వెళ్తారు.అలా తిరుగుతూ తిరుగుతూ శివుడు నందిరూపంలో ఉన్నారని గుర్తిస్తారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

అలా ఆ నందిని పట్టుకునేందుకు భీముడు ప్రయత్నిస్తాడు.అలా ప్రయత్నించగా శివుడు వేరు వేరు శరీర భాగాలతో ఐదు ప్రదేశాల్లో దర్శనమిస్తాడు.

Advertisement

ఆ సమయంలో పరమేశ్వరుడి శరీర భాగాలు పడిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా వెలిగాయి.వీటినే శివపురాణంలో పంచకేదరాలుగా చెప్పుకొచ్చారు.

అయితే శివుని భాగాలు పడిన చోటే తుంగనాథ్ క్షేత్రం గా హిమాలయాలలోని సమున్నత పర్వతశ్రేణికి అధిపతి కాబట్టి ఇక్కడ శివుడిని తుంగనాధుడుగా పిలుస్తారు.అయితే ఈ ఆలయం పేరుకు తగ్గట్టుగానే 12 వేల అడుగుల ఎత్తులో ఉంది.అలాగే ఒకవైపు మందాకిని నది ఇక మరోవైపు అలకనంద నది పారుతుండగా మధ్యలోని చంద్రశీల కొండమీద ఉండే తుంగనాథ్ ఆలయాన్ని చేరుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పాలి.

తాజా వార్తలు