మొన్నటి వరకు హీరోయిన్ లు తమ పర్సనల్ విషయాలు బయట పెట్టడానికి చాలా ఇబ్బంది పడేవారు.చాలా వరకు తమ సీక్రెట్లు బయటపడకుండా బాగా కాపాడుకునే వాళ్ళు.
కానీ ఈ మధ్య అలా లేరు.దాచితే ఏమి వస్తుందన్న ఉద్దేశంతో అన్ని విషయాలు బయట పెడుతున్నారు.
తమ రిలేషన్ షిప్ విషయాలు, పెళ్లి విషయాలు, తమ ప్రెగ్నెన్సీ విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు.
మొత్తానికి వీటిని సోషల్ మీడియా వేదికతో పంచుకుంటూ బాగా సందడి చేస్తున్నారు.
ఆ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కాజల్ తను ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటి నుంచి బాబు పుట్టే వరకు బేబీ బంప్ ఫోటోలతో బాగా సందడి చేసింది.ఇక ఇటీవలే మరో హీరోయిన్ ప్రణీత కూడా ప్రెగ్నెన్సీ కావడంతో తన బేబీ బంప్ ఫోటోను కూడా పంచుకుంది.
ఇక తాజాగా నమిత కూడా తన బేబీ బంప్ ఫోటో షేర్ చేసుకొని అందరి దృష్టిలో పడింది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటి గుజరాతి బ్యూటీ నమిత.
ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉందని చెప్పాలి.ఇక నమిత అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.
తన అందానికి కాస్త గ్లామర్ లుక్ ను పరిచయం చేసి ఏకంగా గ్లామర్ బ్యూటీ గా నిలిచి.మిస్ ఇండియాగా నాల్గవ స్థానంలో గుర్తింపు తెచ్చుకుంది.
ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా నటించింది.
తొలిసారిగా టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన జెమిని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.ఈ సినిమాలో తన అందంతో, నటనతో బాగా ఆకట్టుకుంది.ఆ తర్వాత సొంతం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అలా పలు సినిమాలలో నటించగా.ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో మాత్రం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
బిల్లా సినిమాలో ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఏకంగా గ్లామర్ షో లతో, ఎద అందాలతో అందర్నీ నోటిమీద వేసేలా చేసింది.ఇక బాలకృష్ణ నటించిన సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.
ఒకప్పుడు సన్నగా, నాజూగ్గా ఉండే నమిత ఇప్పుడు బాగా బరువెక్కింది.దీంతో ఆమెకు సినిమాలలో కూడా అవకాశాలు రాలేకపోయాయి.
ఇక పెళ్లి తర్వాత సినీ ఇండస్ట్రీనే దూరం పెట్టింది.బరువు తగ్గించుకోడానికి తెగ ప్రయత్నించింది.2017లో వీరేంద్ర చౌదరిని వివాహము చేసుకుంది నమిత.పెళ్లి జీవితాన్ని సంతోషంగా గడుపుతున్న నమిత ఇటీవలె గర్భవతి అయ్యిందని తెలిసింది.
పైగా తను గర్భవతిగా ఉన్న కూడా బాగా ఫోటో షూట్ చేయించుకుంటూ ఆ ఫోటోలను కూడా పంచుకుంది.ఇక తాజాగా మరో షూట్ చేయించుకోగా అందులో రెడ్ కలర్ డ్రెస్ లో బేబీ బంప్ తో కెమెరాకు స్టిల్ ఇచ్చింది.
ఇక ఆ ఫోటో చూసిన నెటిజనులు లైకులు కొడుతూ ప్రెగ్నెన్సీ ని కూడా బాగా వాడుకుంటున్నారని అంటున్నారు.