ముసుగుతున్న పడుకున్న యజమానిని నిద్రలేపిన కోడి!

చాలా మందికి పొద్దున్నే లేవడం ఇష్టం ఉండదు.బారెడు పొద్దెక్కినా చాలా బద్ధకంగా పడుకుని కనిపిస్తారు.

 The Hen Who Woke Up The Owner Who Was Kicked Out Of The Mask! Hen, Wakeup, Viral-TeluguStop.com

ఇక పల్లెటూర్లలో అయితే చాలా మంది వేకువ జామునే నిద్ర లేస్తారు.గడియారం, అలారం ఏమీ లేకపోయినా, కోడి కూతనే ప్రామాణికంగా తీసుకుంటారు.

కోడి కూత రాగానే తెల్లవారిందని గమనించి, తాము చేసే పనులను మొదలు పెట్టేస్తారు.మగవారు పొలాలకు పయనమవుతారు.

ఆడవారు ఇల్లు ఊడవడం, ఇతరత్రా పనులు చేయడం ప్రారంభిస్తారు.అయితే చాలా మంది కోడి పుంజులే అలారం మాదిరిగా పని చేస్తాయి.

వాటికి ప్రత్యేకించి ట్రైనింగ్ ఇవ్వకపోయినా, అవి తమ పని తాము చేసుకుపోతాయి.ఠంచనుగా సమయానికి తమ కూతతో అందరినీ నిద్ర లేపుతాయి.

అయితే ఓ కోడి ఇలాగే కూత వేసింది.అయినా తన యజమాని నిద్ర లేవకపోవడంతో వెరైటీగా నిద్ర లేపింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇటీవల సోషల్ మీడియాలో ఓ కోడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

తెల్లవారి చాలా సేపు అయినా తన యజమాని నిద్ర లేవకపోవడం ఆ కోడి గమనించింది.వెంటనే బెడ్ రూమ్‌లో దూరి తన యజమానిని నిద్ర లేపాలని చూసింది.

అప్పటికి కూడా ఆ వ్యక్తి ముసుగు తన్ని పడుకున్నాడు.బాగా గురకలు పెడుతూ చక్కగా నిద్రపోతున్నాడు.

తాను కూత వేసినా తన యజమాని నిద్ర లేవకపోవడం ఆ కోడి చూసింది.వెంటనే తన యజమానిని నిద్ర లేపాలని అనుకుంది.

వెంటనే అతడు నిద్రిస్తున్న గదిలోకి వచ్చింది.వచ్చీ రాగానే అతడికి మీదకు ఎక్కింది.

అటూ ఇటూ తిరిగినా ఆ వ్యక్తి నిద్ర లేవ లేదు.దీంతో అతడు తల పెట్టుకున్న వైపు వెళ్లింది.

అయినప్పటికీ అతడు గుర్రు పెట్టి మరీ చక్కగా నిద్రపోతున్నాడు.అసలే తన కూతకు నిద్ర లేవ లేదని భావించిన ఆ కోడి తన యజమాని తల వద్ద కొక్కోరొక్కో అంటూ గట్టిగా కూత వేసింది.

అంతే ఆ కూతకు ఆ యజమాని నిద్ర లేవక తప్పలేదు.ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.

ఆ వ్యక్తికి అలారం అవసరం లేదని, పొద్దున్నే ఆఫీసుకు లేట్ అవకుండా ఆ కోడి టైముకు లేపుతుందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube