ఏపీ మహిళలకు శుభవార్త .. ఆ పథకానికి రైట్ రైట్ చెప్పబోతున్న చంద్రబాబు 

ఏపీలో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ( TDP alliance )ప్రభుత్వం పై అప్పుడే అనేక విమర్శలు చేస్తుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress Party ).

ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలతో పాటు,  ఎన్నో హామీలను టిడిపి కూటమి ప్రభుత్వం ఇచ్చింది.

అప్పటి వైసిపి ప్రభుత్వం కంటే రెట్టింపు స్థాయిలో పథకాలను జనాలకు అందిస్తామని హామీలు ఇచ్చింది.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీల అమలులో ఇంకా నాన్చివేత ధోరణిని అవలంబించడం, ఇప్పట్లో సంక్షేమ పథకాలను అమలు చేసే పరిస్థితి లేదన్నట్లుగా సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్న క్రమంలో,  వైసిపి తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడుతోంది.

ఎన్నికలకు ముందు అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చి , అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోకపోవడం చంద్రబాబుకు ముందు నుంచి అలవాటేనని తీవ్ర విమర్శలు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే మహిళలు( women ) నొచ్చుకోకుండా ముందుగా మహిళలకు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయాలని చంద్రబాబు( Chandrababu ) నిర్ణయించుకున్నట్లు సమాచారం .ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై కర్ణాటక , తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు అధ్యయనం చేసి వచ్చారు.ఈనెల 12న రవాణా శాఖ అధికారులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

Advertisement

ఆ శాఖ పై సమీక్ష నిర్వహించనున్నారు .ఈ సమీక్ష లో ఉచిత బస్సు ప్రయాణం పై ఒక నిర్ణయం తీసుకోనున్నారు.రెండు నెలలైనా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయకపోతే ప్రజల్లో కొంత వ్యతిరేకత ఎదురవుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది .

అందుకే ముందుగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని వీలైనంత త్వరగా అమలు చేసే దిశగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు .ఈ నెల 12న అధికారులతో సమీక్ష తరువాత ఉచిత బస్సు ప్రయాణం పై చంద్రబాబు ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం .ఈ ఉచిత బస్సు పథకం అమలు జరిగితే ఏడాదికి 250 కోట్ల రూపాయలు ఏపీఎస్ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే అధికారులు లెక్కలు తేల్చారు.అయితే ఇది అంత పెద్ద భారమేమి కాదని , ఈ హామీని అమలు చేయడం ద్వారా మహిళల్లో సానుకూలత పెంచుకోవచ్చని భావిస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు