Hospital Ghost : ఆసుపత్రిలో ప్రత్యక్షమైన దెయ్యం.. వీడియో చూస్తే హడలి పోవాల్సిందే!

సాధారణంగా పాడుబడ్డ భవంతుల్లో, ఆసుపత్రి, స్మశానంలో ఎక్కువగా దెయ్యాలు కనిపిస్తాయని చాలామంది నమ్ముతుంటారు.సినిమాల్లో కూడా ఈ ప్రదేశాల్లోనే ఎక్కువగా దెయ్యాలు ఉన్నట్లు చూపిస్తుంటారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయేవారు అక్కడే తిరుగుతూ ఉంటారని అంటుంటారు.అయితే వీటిలో నిజమేమీ లేదని శాస్త్రవేత్తలు కొట్టి పడేస్తుంటారు.

The Ghost That Appeared In The Hospital , Hospital Ghost, Ghost Video, Viral Vi

కాగా తాజాగా ఒక హాస్పిటల్లో జరిగిన సంఘటన చూసి అందరూ హడలిపోతున్నారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక సెక్యూరిటీ గార్డు కుర్చీలో కూర్చుని ఉండటం చూడవచ్చు.ఇంతలోనే రిసెప్షన్ డోర్ అదంతట అదే ఓపెన్ అయింది.

Advertisement

దాంతో అతడు ఆ డోర్ వైపుకు వెళ్లి మాట్లాడటం ప్రారంభించాడు.కానీ అక్కడ ఎవరూ లేరు.

అతడు అక్కడ ఎవరూ లేకపోయినా మాటలు మాట్లాడుతూ ఎవరో ఉన్నట్లు ప్రవర్తించాడు.సీసీ కెమెరాలో మాత్రం అక్కడ చీమ కూడా చిటుక్కు మనడం లేదని తెలిసింది.

దీంతో అతడు కచ్చితంగా ఒక దెయ్యాన్ని చూసే మాట్లాడుతున్నాడని అందరూ అనుకున్నారు.లేకుంటే డోర్ అదంతట అదే ఓపెన్ అవడం ఏంటి? ఉత్త గాలిలో సెక్యూరిటీ గార్డ్ మాట్లాడడం ఏంటి? అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.పైగా హాస్పిటల్‌లో ఈ ఘటన జరగడానికి ఒకరోజు ముందే ఒక మహిళ చనిపోయిందట.

ఆమే దెయ్యమై ఆసుపత్రికి వచ్చి ఉండొచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కాగా కొందరు నెటిజన్లు ఇది ప్రాంక్ అని కొట్టి పడేస్తున్నారు.

షూటింగ్ కోసం వెళ్లి చిక్కుకున్న బాలకృష్ణ ,కృష్ణం రాజు..బిస్కట్స్, చేపలతో ప్రాణం కాపాడుకున్నారు

ఈ క్రమంలోనే ఆసుపత్రి యాజమాన్యం రిసెప్షన్ గేటు లో ప్రాబ్లం ఉండటం వల్ల ఒక్కోసారి అది ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు.ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం చాలా మందిని భయపడుతోంది.

Advertisement

తాజా వార్తలు