కాంగ్రెస్ బలానికి తొలి పరీక్ష : పాసవుతుందా ?

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.రాజస్థాన్ ,మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, తెలంగాణ, మిజోరం కు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో మూడు రాష్ట్రాలలో గత ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వాలే గెలుపొందాయి .అయితే మధ్యప్రదేశ్లో భాజపా చక్రం తిప్పడంతో అధికారాన్ని కోల్పోయింది.అయితే చాలాకాలం తర్వాత కర్ణాటకలో ఏకపక్షంగా అధికారంలోకి రావడం అంతే కాకుండా అధికార భాజాపాకు( BJP ) వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఐక్యం చేయగలగడంతో కాంగ్రెస్లో ఇప్పుడు కొత్త ఊపు కనిపిస్తుంది.

ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడంతో కాంగ్రెస్ పెరిగిన తన బలాన్ని మిత్రపక్షాలకు చాటుకోవడానికి ఇది ఒక బలపరీక్షగా నిలవనున్నట్లు తెలుస్తుంది.ఈ పరీక్షలో గనుక కాంగ్రెస్( Congress ) పాస్ అయితే కచ్చితంగా విపక్ష కూటమికి బలమైన నాయకుడిగా సగర్వంగా నిలబడే అవకాశం దక్కుతుంది.అంతేకాక అధికార భాజపాకు హెచ్చరికలు పంపడం కూడా కుదురుతుంది .అయితే అసెంబ్లీ ఎన్నికలు గెలిచినా సార్వత్రిక ఎన్నికలకు మాత్రం మోడీ మేనియా ముంది కాంగ్రెస్ తలొంచుతుంది .

ఇంతకుముందు కూడా కాంగ్రెస్( Congress ) అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి లోక్సభ ఎన్నికలను మాత్రం భాజాపా( BJP )కు కోల్పోయింది.అయితే ఈసారి దేశవ్యాప్తంగా మార్పు వచ్చిందని బిజెపిపై వ్యతిరేకత మెజారిటీ రాష్ట్రాలలో ఉందని నమ్ముతున్న కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని తిరిగి తీసుకురావాలన్న పట్టుదల లో ఉన్నట్లుగా తెలుస్తుంది.ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కనుక మెజారిటీ రాష్ట్రాలను గెలుచుకుంటే అది కచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని చెప్పవచ్చు.

Advertisement

అంతేకాక ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్కు వదలడానికి అప్పుడు విపక్షాలకు కూడా అంత ఇబ్బంది ఉండకపోవచ్చు.ఇలా ఏ రకంగా చూసిన తమ పట్టు నిరూపించడానికి ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీలను గెలవడం కాంగ్రెస్కు అత్యంత అవసరమని చెప్పవచ్చు.

మరి ఈ టాస్క్ ను టెన్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఏ విధంగా పూర్తి చేస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు