కుక్కతో దిగిన కూడా అదే ఫీలింగ్సా.. ఆర్జీవికి నెటిజన్స్ షాక్?

టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.ఎందుకంటే ఈయన తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకున్నాడు.

 The Feeling Is The Same When You Go Down With A Dog Netizens Shock To Rgv , Dog,-TeluguStop.com

ఈయన ప్రతి ఒక్క విషయంలో సంచలనంగా మారుతూ ఉంటాడు.నిజానికి మొదట్లో రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

కెరీర్ మొదట్లో ఎన్నో మంచి మంచి సినిమాలను తెరకెక్కించాడు.చాలా వరకు ఎంతోమంది యంగ్ హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు.

కానీ గత కొంతకాలం నుండి వర్మ స్టైల్ మొత్తం మారింది.ముఖ్యంగా ఆయన సినిమా రుచులు కూడా మొత్తం మారిపోయాయి.

మంచి మంచి కథలను కాకుండా కాంట్రవర్సీ సినిమాలను తెరకెక్కిస్తున్నాడు.దాంతో ప్రేక్షకుల నుండి బాగా కౌంటర్లు ఎదుర్కొంటున్నాడు.

నిజానికి వర్మ కు వచ్చే కౌంటర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే.ఇక ఆయన చేసే కామెంట్లు, కౌంటర్ల గురించి భరించలేం.ఎందుకంటే ఆయన మాటలు అలా ఉంటాయన్నమాట.ఈయన సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

ఈయన చేసే పోస్టుల గురించి అందరికి తెలిసిందే.హాట్ హాట్ గ్లామర్ బ్యూటీ లతో ఫోటోలు దిగుతూ, డాన్సులు చేస్తూ బాగా రెచ్చి పోతూ ఉంటాడు.

వర్మ ఎంజాయ్ చేసే విధానాన్ని చూస్తే కుర్రాళ్లు మాత్రం చాలా కుళ్లుకుంటారు.ఏం అదృష్టం అడుకొచ్చుకున్నారు సార్ అంటూ తెగ కామెంట్లు పెడుతూ ఉంటారు.

ఇక ఈయనకు విమర్శలు కూడా బాగా వస్తుంటాయి.కానీ వాటిని అస్సలు లెక్క చేయడు.

ఒకవేళ విమర్శలను పట్టించుకుంటే తిరిగి విమర్శకులకే తన మాటలతో బోల్తా కొట్టాడు.ఇండస్ట్రీకి చెందిన వారిపై కూడా విమర్శలు చేస్తూ ఉంటాడు.ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే మాత్రం ఇంటర్వ్యూ స్పెషల్ వైరల్ గా మారుతుంది.ఆయన మాట్లాడే బోల్డ్ మాటల గురించి ఎంత చెప్పిన తక్కువే.తనను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అమ్మాయిలు లేదా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఉంటే మాత్రం వర్మ మాటలకు వాళ్లు పడిపోవాల్సిందే.వర్మను ఇంటర్వ్యూ చేసినందుకు తిరిగి వాళ్లే మరింత సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంటారు.

ఇదంతా పక్కన పెడితే తాజాగా అయినా ఒక ఫోటో షేర్ చేసుకున్నాడు.అందులో పెంపుడు కుక్కతో ఫోటో దిగుతూ కనిపించగా.

అందులో తన ఎక్స్ప్రెషన్స్ ను చూసి నెటిజన్స్ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

కుక్కతో దిగిన సేమ్ ఫీలింగ్స్.యాంకర్స్ తో దిగిన సేమ్ ఫీలింగ్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ చెయ్యు అంటూ కామెంట్ పెట్టారు.అయితే ఇదంతా పక్కన పెడితే.

ఇటీవల హైదరాబాద్ లో కుక్కల దాడితో ఒక బాలుడు మరణించిన సంగతి తెలిసిందే.దీంతో అప్పటి నుంచి వర్మ ఈ విషయం పట్ల సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్నాడు.

అంతేకాకుండా గద్వాల్ విజయను బాగా టార్గెట్ చేశాడు.అయితే తాజాగా ఆ ఫోటో పరుచుకుంటూ.

గద్వాల్ విజయను ట్యాగ్ చేసి.నేను కూడా కుక్కలని ఇష్టపడతాను.

కానీ ఇటువంటి కరిచే కుక్కలను అరిచే కుక్కలను అసలు ఇష్టపడను అని పంచుకున్నాడు.ప్రస్తుతం ఆ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube