గ్రహణాలు ఏర్పడినప్పడు చాలా మంది రోడ్లపైకి వచ్చి ఫిల్మ్‌ల సాయంతో వాటిని చూస్తుంటారు.అయితే సనాతన సాంప్రదాయాలను పాటించే వారు గ్రహణాల సమయంలో బయటికి రారు.
అంతేకాకుండా ఆ రోజు గ్రహణం ముగిసే వరకు భోజనం ముట్టరు.ఇక 2023లో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి.
అందులో రెండు సూర్య గ్రహణాలు ఉంటే, రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి.అయితే వీటిలో రెండిటిని మాత్రమే భారతదేశంలో చూడగలం.
దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ ఏడాది ఏప్రిల్ 20న పూర్తి సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
అయితే, ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు.అమావాస్య తిథినాడు ఏర్పడే ఈ గ్రహణం భారత దేశంలో చూడడానికి వీలుండదు.
ఇది కేవలం ఆస్ట్రేలియా, అంటార్కిటికా, ఆగ్నేసియా, పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది.

మే 5-6 మధ్యకాలంలో చంద్ర గ్రహణం భారతదేశంలో చూడవచ్చు.భూమి చుట్టూ తిరిగే చంద్రుడు భూమి యొక్క నీడ యొక్క కొంత భాగం గుండా వెళుతున్నప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంది.ఈ సమయంలో, చంద్రునిపై పడే సూర్యరశ్మి పాక్షికంగా కత్తిరించినట్లు అనిపిస్తుంది.
అయితే కేవలం ఛాయ మాత్రమే మనకు కనిపిస్తుంది.

అందువల్ల దీనిని పండితులు గ్రహణంగా పరిగణించడం లేదు.ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, అంటార్కిటికాలో ఈ చంద్ర గ్రహణం కనిపిస్తుంది.అక్టోబర్ 14న రెండవ సూర్య గ్రహణం ఏర్పడుతుంది.
ఇది భారతదేశంలో కనిపించదని, దీనికి సూత కాలం చెల్లదని పండితులు చెబుతున్నారు.ఇక రెండవ చంద్ర గ్రహణం అక్టోబర్ 28వ తేదీన ఏర్పడనుంది.
ఆ సమయంలో సూతకాలం ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఆ రోజు రాత్రి 1.05 నిమిషాలకు ప్రారంభమై, రాత్రి 2.24 వరకు ఉంటుంది.ఇది మన దేశంతో పాటు ఆస్ట్రేలియా, యూరప్, అంటార్కిటికా, పసిఫిక్, హిందూ మహాసముద్రం ప్రాంతాల్లో కనిపిస్తుంది.







