సౌత్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన రజినీకాంత్ గురించి చెప్పాలి అంటే ఆయన ఒక మహా వృక్షం అనే చెప్పాలి.ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగింది తన ప్రయాణం.
కష్టం అయిన పని ని సైతం చేసి చూపించిన వ్యక్తి ఒక బస్ కండక్టర్ హీరో అవ్వడం ఎంటి అని అందరూ ఆశ్చర్య పడేలా చేసిన ఒకే ఒక వ్యక్తి.ఈయన ఎంత పెద్ద హీరో అనేది సౌత్, నార్త్ లో ఉన్న ఆడియన్స్ అందరికీ తెలుసు కష్టపడితే సక్సెస్ అలా ఉంటది అనడానికి ఆయనే ఒక ఉదాహరణ.

అయితే అలాంటి రజినీకాంత్ చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశాడు.ఆయన ఏ డైరెక్టర్ తో చేసిన ఆయన కంటు ఒక సెపరేట్ స్టైల్ ఉంటుంది అందరి డైరక్టర్ల స్టైల్స్ ఫాలో అవుతూనే తన స్టైల్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాడు.అయితే తమిళ్ యంగ్ డైరెక్టర్ అయిన పా రంజిత్ డైరెక్షన్ లో చేసిన కబాలి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది రజినీకాంత్ ఎనర్జీ ఈ సినిమాలో మిస్ అయింది ఇక ఈ సినిమా తర్వాత మళ్లీ ధనుష్ ప్రొడ్యూసర్ గా రజినీకాంత్ హీరోగా కాలా అనే ఇంకో సినిమా చేశాడు ఇది కూడా ప్లాప్ అయింది…

రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ రెండు సార్లు ఛాన్స్ ఇస్తే రెండు సార్లు ప్లాప్ లు ఇచ్చిన పా రంజిత్ ని అప్పట్లో రజినీ ఫ్యాన్స్ చాలా తిట్టారు కూడా పా రంజిత్ కూడా రజినీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చ లేదు ఆయనకి హిట్ ఇవ్వలేదే అనే ఒక భాదలో ఉన్నట్టు అప్పట్లో చాలా వార్తలే వచ్చాయి…అయితే ప్రస్తుతం రజినికాంత్ తన సినిమాలతో చాలా బిజీ గా ఉన్నాడు పా రంజిత్ కూడా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకులని అలరించడానికి రెడీ అవుతున్నాడు…
.







