ఏపీ అసెంబ్లీలో ఇవాళ జరిగిన పరిణామాలు బాధించాయని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.నియంతృత్వ ధోరణిలో శాసన సభ జరుగుతోందని ధ్వజమెత్తారు.
ప్రజా సమస్యలపై గళమెత్తడానికి వచ్చిన తమపై శాసనసభలో అధికార పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని ఆరోపించారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు అన్న బాలయ్య అటువంటి వ్యక్తిపై అక్రమ కేసు పెట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అన్యాయమని తెలిపారు.చంద్రబాబును జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఆయనను అక్రమ కేసులో ఇరికించారన్నారు.
జగన్ పాలనలో రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని బాలయ్య మండిపడ్డారు.







