దేశం ప్రమాదంలో ఉంది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!

దేశంలో వైరస్ విజృంభణ భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.

ఊహించని విధంగా కేసుల సంఖ్య అతి తక్కువ కాలంలోనే ఐదు రెట్లు పెరిగిపోవటం తో దేశం ప్రమాదంలో పడినట్లే అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో దేశంలో ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించాలని, భౌతిక దూరం పాటిస్తూ నోరు, మొహం కవర్ అయ్యే విధంగా మాస్కు ధరించాలని  పేర్కొన్నారు.

కరోనా నిబంధనలు పాటించకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.దేశంలో పలు జిల్లాలలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని.యావత్ దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితిని కట్టడి చేయకపోతే .మూల్యం గట్టిగా చెల్లించాల్సి వస్తుంది అన్నట్టు తెలిపారు.దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ 5 లక్షలు దాటిందని చెప్పింది.

Advertisement

ప్రస్తుతం 5,40,720 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపింది.దాదాపు దేశవ్యాప్తంగా పది జిల్లాలలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నట్లు వీటిలో మహారాష్ట్ర లోనే  8 జిల్లాలు ఉన్నాయని సోషల్ మీడియాలో స్పష్టం చేశారు.

ఆ ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా ఉన్నట్లు పేర్కొన్నారు. .

Advertisement

తాజా వార్తలు