ఉద్యోగులను ఆఫీసులోకి పంపించి తాళం వేసిన కంపెనీ.. షాకింగ్ వీడియో వైరల్..

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లలో విపరీతమైన ఆగ్రహానికి కారణమవుతోంది.ఈ వీడియోలో ఉద్యోగులు బయటకు వెళ్లకుండా ఓ కంపెనీ వాచ్‌మెన్ ఆఫీస్( Watchman’s Office ) తలుపులకు తాళం వేస్తున్నట్లు కనిపించింది.

 The Company Locked The Employees By Sending Them To The Office Shocking Video Vi-TeluguStop.com

ఈ వీడియోను పారిశ్రామికవేత్త రవి హండా( Ravi Handa ) ట్విట్టర్‌లో షేర్ చేశాడు.వీడియోలో, రవి వాచ్‌మెన్‌తో మాట్లాడినట్లు వినవచ్చు.

అయితే లాక్ ఎందుకు వేస్తున్నావ్ అని ఆరా తీయగా సదరు వాచ్‌మెన్ మాట్లాడుతూ డోర్లకు తాళం వేయమని, అనుమతి లేకుండా ఉద్యోగులను బయటకు రానివ్వవద్దని మేనేజర్‌లలో ఒకరు చెప్పినట్లు వెల్లడిస్తాడు.

ఈ వీడియో ఆన్‌లైన్‌లో బాగా పాపులర్ అయ్యింది.

చాలా మంది దీని గురించి తెలుసుకొని షాక్ అవుతున్నారు.భారతదేశంలోని ఎడ్‌టెక్ కంపెనీ ( edtech company )వ్యవస్థాపకులు ఈ రకమైన ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని అన్నారు.

దేశం విడిచి ఉద్యోగులకు మరింత స్వేచ్ఛని ఇచ్చే వేరే దేశాలకు వెళ్లాలని వారు సూచించారు కూడా.కాగా ఈ షాకింగ్ ఘటన ‘కోడింగ్ నింజాస్’( Coding Ninjas ) కంపెనీలో చోటు చేసుకుంది.

పారిశ్రామికవేత్త రవి సదరు కంపెనీ ఈ విషయమై రిలీజ్ చేసిన ఒక ప్రకటనను కూడా పంచుకున్నారు.ఆ ప్రకటనలో, ఈ సంఘటన తమ ఉద్యోగుల్లో ఒకరు చేసిన పొరపాటు అని కంపెనీ పేర్కొంది.ఈ సమస్యను వెంటనే పరిష్కరించామని, ఉద్యోగి క్షమాపణలు చెప్పారని కంపెనీ క్లారిటీ ఇచ్చింది.కంపెనీ వ్యవస్థాపకులు ఉద్యోగులందరికీ క్షమాపణలు కూడా చెప్పారట.సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉద్యోగులను లాక్ చేయడం అనేది వారి హక్కులకు, వర్క్‌స్పేస్‌ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube