అమెరికా దేశం, దక్షిణ ఒహియోలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో( Walmart store in Ohio ) తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి.ఒక తల్లి నిర్లక్ష్యం వల్ల పిల్లోడు ఈ కాల్పులు జరిపాడు.
పిల్లోడి ప్రాణాలను ప్రమాదంలో పడేశారంటూ ఆ మహిళపై పోలీసులకు కేసు కూడా నమోదు చేశారు.ఈ సంఘటన గత వారం గురువారం ఉదయం 11 గంటలకు రిటైల్ దిగ్గజం వేవర్లీ బ్రాంచ్‌లో జరిగింది.
వేవర్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్( Waverly Police Department ) ప్రకారం, ఆ మహిళ 2 ఏళ్ల కుమారుడు ఆమె పర్సులో నుంచి టారస్ 9 ఎంఎం పిస్టల్‌ను తీసుకున్నాడు.అనంతరం ట్రిగ్గర్‌ను లాగాడు.దాంతో తుపాకీలోని బుల్లెట్ స్టోర్ పైకప్పుకు తగిలింది.అదృష్టవశాత్తు పిల్లోడు పైకి కాల్చాడు.అదే వేరే వ్యక్తుల మీదకు కాల్చినట్లయితే వారి ప్రాణాలు పోయి ఉండేవి.పెద్ద నష్టం జరుగుండేది.
ఈ ఘటనలో ఎవరి ప్రాణాలు పోకపోనప్పటికీ ఆ చిన్నారి నుదుటికి గన్ మ్యాగజైన్ బలంగా వచ్చి తగిలింది. దానివల్ల అతడికి స్వల్పంగా గాయం అయ్యింది.
పోలీసులు ఆ మహిళను అరెస్టు చేసి పైక్ కౌంటీ కోర్టులో పిల్లలను ప్రమాదంలో పడేశారంటూ అభియోగాలు మోపారు.వారు బాలుడిని వైద్య సంరక్షణ కోసం అత్యవసర సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లిన బంధువు వద్ద విడిచిపెట్టారు.వేవర్లీ పోలీసులు తమ ఫేస్‌బుక్ పేజీలో ఒక ప్రకటనను పోస్ట్ చేసారు, ఇలాంటి సంఘటనల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా పిల్లల దగ్గర తుపాకీలను వాడేటప్పుడు ప్రజలు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు.
తుపాకీలను బాధ్యతాయుతంగా, సురక్షితంగా కలిగి ఉండటం, స్టోర్ చేయడం యొక్క ప్రాముఖ్యతను కూడా వారు నొక్కి చెప్పారు.