ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి.ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది.
జూపల్లి తరహాలోనే ఉమ్మడి జిల్లాకు చెందిన మరి కొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవితో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి భేటీ అయ్యారు.
అయితే గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు జోరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.తాజాగా మల్లు రవితో ఆయన సమావేశం కావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.