తెలంగాణలో మారుతున్న రాజకీయ వాతావరణం.. ఇక సమరమేనా?

తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం రోజుకు ఎవరూ ఊహించని రీతిలో మారుతోంది.

తాజాగా ఎంఐఎం కార్పొరేటర్ ఉదంతం మరవకముందే మరో కార్పొరేటర్ కూడా పోలీసులపై దురుసుగా ప్రవర్తించడంతో ఇక మరో సారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే టీఆర్ఎస్ - ఎంఐఎం స్నేహ పూర్వకమైన పార్టీల మధ్య ఒక్కసారిగా విభేదాలు తలెత్తడంతో ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి చర్చ ఎంఐఎం టీఆర్ఎస్ పై పడింది.ఎన్నడూ లేని విధంగా పోలీసులు ఎంఐఎం లోని పరిస్థితుల పట్ల స్పందించడం రచ్చ రచ్చగా మారడంతో టీఆర్ఎస్- ఎంఐఎం కు చెడిందా, లేక ఇరు పార్టీల వ్యూహమా అనే చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతోంది.

  దీంతో బీజేపీకి పరోక్షంగా చెక్ పెట్టనున్నారా అనే మరో చర్చ కూడా మొదలైంది.ఏది ఏమైనా ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వాతావరణం అనేది కీలకంగా మారుతూ హీటెక్కుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ నేతలెవరూ స్పందించకున్నా రానున్న రోజుల్లో స్పందించే అవకాశం కనిపిస్తోంది.ఇక గట్టి పోరాటమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ ఎంఐఎం కార్పొరేటర్ల ఇష్యూపై ఏ విధంగా స్పందిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Advertisement

ఏది ఏమైనా రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులు మరింతగా రణరంగంగా మారే అవకాశం కనిపిస్తోంది.అయితే ఈ రాజకీయ రణరంగం ఇంకెన్ని రోజులు కొనసాగుతుందనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో పార్టీల వ్యూహ, ప్రతివ్యూహాలను బట్టి మనకు కాస్త క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అయితే మారుతున్న రాజకీయ వాతావరణం బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో రాజకీయ పరిస్థితులు రణరంగంగా మారే అవకాశం కనిపిస్తోంది.ఏది ఏమైనా ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఎలా స్పందస్తారనేది చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు