కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకనుండి టోల్ గేట్ చార్జీలు కట్టక్కర్లేదు.. కండీషన్ అప్లై.. !

అత్యవసరమైన పని మీద వెళ్లుతున్న సమయంలో టోల్ గేట్ దగ్గర ట్రాఫిక్ జామ్‌ అయితే కలిగే చికాకు ఏ స్దాయిలో ఉంటుందో అనుభవించే వారికే అర్ధం అవుతుంది.

ఎలాగో టోల్ గేట్ చార్జీలు పే చేస్తున్నాం.

కానీ సమయాన్ని కూడా వృధా చేస్తున్నాం అని బాధపడే వారు లేక పోలేదు.ఇలాంటి సమయంలో కేంద్రం ఫాస్టాగ్స్ తప్పనిసరి రూల్స్ అమలులోకి తెచ్చింది.

The Central Government Has Made A Key Decision Toll Gate Charges Will No Longer

దీని వల్ల అయినా సమయం వృధా కాకుండా వాహనదారుడు వెళ్లిపోవచ్చనే ఆలోచనతో.అయినా గానీ ట్రాఫిక్ తగ్గడం లేదు.

అందుకే మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఇందులో భాగంగా కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది.

Advertisement

టోల్ ప్లాజాల నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న పసుపు గీత దాటి వాహనాలు వేచి ఉంటే అప్పుడు ఆ గీత ముందున్న వాహనాలు టోల్ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చని తెలియ చేస్తుంది.టోల్ ప్లాజా ఆపరేటర్లలో ఉన్న నిర్లక్ష్యం తగ్గించడానికే, ఫాస్ట్ గా వాహనాలను పంపించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుపుతుంది కేంద్రం.

ఈ నిర్ణయంతో ఇకనుండైన టోల్ ప్లాజా ఆపరేటర్లు వేగంగా వాహనాలను పంపిస్తారని ఆశిద్దాం.

Advertisement

తాజా వార్తలు