తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అప్పుల వివరాలను కేంద్రం బయటపెట్టింది.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ అప్పుల భారం ప్రతి సంవత్సరం పెరుగుతోందని కేంద్రం చెబుతుంది.2018 నాటికి తెలంగాణ అప్పు రూ.1,60,296 కోట్లు ఉన్నట్లు తెలిపింది.దీంతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అప్పు రూ.2,67,530 కోట్లు ఉన్నట్లు పేర్కొంది.2020-21 నాటికి తెలంగాణ అప్పులు 18.7 శాతం పెరిగాయని కేంద్రం ప్రకటించింది.
అటు 2018 నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.2,29,333.8 కోట్లు ఉందని తెలిపింది.ప్రస్తుతం రూ.3,60,333.4 కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.