వైరల్: ఈ కుర్రాడి స్పీడ్‌ చూసి కంపెనీలే భయపడుతున్నాయి... మేన్ మెషీన్ అనాలేమో?

మనలో ఎవరైనా సరే.రోజూ ఒకే పనిని మరలా మరలా చేస్తే ఆ పనిలో మంచి నైపుణ్యం సాధిస్తారు.

అవును, అనుభవంతో ఎవరైనా మాస్టర్ అయిపోతారు.ప్రస్తుతం ఆ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అవును.ఆ వీడియోలోని కుర్రాడు ఉల్లిపాయలను కోయడంలో(cutting onions) అసాధారణ వేగాన్ని ప్రదర్శిస్తుండడంతో హాట్ టాపిక్ అయ్యాడు.

దాంతో ఆ కుర్రాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.జస్ట్ క్రేజీ థింగ్స్(Just Crazy Things) అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ కాబడ్డ ఈ వీడియోలో ఏం ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇది పూర్తిగా చదవాల్సిందే!

The Boy Demonstrates Extraordinary Speed In Chopping Onions, Viral Video, Viral
Advertisement
The Boy Demonstrates Extraordinary Speed In Chopping Onions, Viral Video, Viral

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే.ఓ కుర్రాడు ఉల్లిపాయలను అతి వేగంగా కట్ చేస్తున్న అరుదైన వైనాన్ని మనం చూడవచ్చు.అవును.

అతగాడు ఉల్లిపాయ(Onion) వైపు కనీసం కన్నెత్తి చూడనే చూడకుండా అతి వేగంగా చాకుతో ఎలా కోస్తున్నాడో ఇందులో చూడవచ్చు.చేతిని అతి వేగంగా కదిలిస్తూ సెకెన్ల వ్యవధిలో ఉల్లిపాయలను అతి చిన్న చిన్న ముక్కలుగా తరిగేస్తున్నాడు.

దాంతో అతడి ప్రతిభను ఓ వ్యక్తి కేమెరాలో బంధించి సోషల్ మీడియాలో(social media) పోస్ట్ చేయగా ప్రస్తుతం సదరు వీడియో వైరల్ అవుతోంది.

The Boy Demonstrates Extraordinary Speed In Chopping Onions, Viral Video, Viral

ఇంకేముందు.ఆ వీడియో చూసిన జనాలు కుర్రాడి ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నారు.దాంతో ఆ వైరల్ వీడియో లక్షల్లో వీక్షించారు.

అంతేకాకుండా వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు కూడా.ఇక ఆ వీడియోపై నెటిజన్లు చేసిన కామెంట్స్ అయితే లెక్కేలేదు.

Advertisement

సదరు వీడియో తిలకించిన కొందరు.``ఆ కుర్రాడు మిక్సీ కంటే వేగంగా కట్ చేసి పారేస్తున్నాడు!`` అని కామెంట్ చేస్తే, మరి కొందరు ``ఇతను మనిషి రూపంలో ఉన్న మెషిన్.

మానవ మెషీన్!`` అంటూ రాసుకొచ్చారు.మరికందరైతే.

``మనం అలా కట్ చేయడానికి ప్రయత్నిస్తే వేళ్లు తెగిపోవడం ఖాయం!`` అంటూ కామెంట్లు చేయగా.ఇంకొందరు.

``ఇది చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తోంది.ఉల్లిపాయలు కట్ చేయడంలో ఆ కుర్రాడి వేగాన్ని ఎంతో చతురత కలిగిన 5 స్టార్ట్ హోటల్ ఉద్యోగులు కూడా అందుకోలేరు.

ఇక ఉల్లిపాయలు తరిగే యంత్రాలను తగలబెట్టాల్సిందే!`` అని కామెంట్ చేయడం గమనార్హం.

తాజా వార్తలు