81 ఏళ్ల తర్వాత లైబ్రరీకి చేరిన బుక్.. 17వ పేజీలో ఏముందంటే..?

ఎన్నో పురాతన గ్రంధాలు, పుస్తకాలు, తారపత్ర గ్రంథాలు( Texts, books, treatises ) చాలా సంవత్సరాల తర్వాత బయటపడుతూ ఉంటాయి.వీటిల్లో ఉండే విషయాలు చాలా ఏళ్ల తర్వాత వెలుగులోకి వస్తూ ఉంటాయి.

, తాజాగా అలాంటి ఒక ఘటన చోటుచేసుకుంది.81 ఏళ్లకు ఒక పుస్తకం లైబ్రరీకి చేరుకోగా.అందులో 17వ పేజీలో ఉన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.

వాషింగ్టన్‌లోని ఎబర్డీన్‌లో( Aberdeen, Washington ) ఉన్న ఒక లైబ్రరీకి ఒక రీడర్ వెళ్లాడు.81 ఏళ్ల తర్వాత లైబ్రరీ నుంచి తీసుకున్న ఒక పుస్తకాన్ని తిరిగి ఇచ్చేందుకు అక్కడకు వచ్చాడు.ఈ పుస్తకాన్ని చూసి అక్కడివారు ఆశ్చర్యపోయారు.

ఈ పుస్తకం 1942 మార్చి 30న ఇష్యూ చేసినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోయారు.అప్పటి పుస్తకం ఇప్పుడు 81 ఏళ్ల తర్వాత లైబ్రరీకి రావడంతో అందరూ షాక్ అయ్యారు.

Advertisement

ఆ పుస్తకంలోని 17వ పేజీలో ఉన్న కాగితం ఆసక్తికరంగా మారింది.తనకు ఒకవేళ డబ్బులు ఇచ్చిన పక్షంలో ఈ పుస్తకాన్ని ఎప్పటికీ చదవను అంటూ ఆ కాగితంలో రాసి ఉంది.

దీనిని బట్టి చూస్తే ఈ పుస్తకం తీసుకెళ్లిన వ్యక్తికి ఈ పుస్తకం చదవడం ఇష్టం లేదని అర్ధమవుతుంది.

ది బౌంటీ ట్రిలాజీ( The Bounty Trilogy ) అనే వ్యక్తి రాసిన ఈ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి ఒక వ్యక్తి తీసుకెళ్లాడు.81 ఏళ్ల తర్వాత పుస్తకాన్ని తిరిగి ఇవ్వడానికి ఎబర్డీన్ టింబర్లాండ్ లైబ్రరీకి వచ్చాడు.ఈ పుస్తకం పాత సమాన్ల మధ్య పడి ఉందని, ఇప్పుడు లభ్యం కావడంతో తిరిగి ఇచ్చినట్లు చెబుతున్నాడు.

లైబ్రరీ ప్రతినిధులు ఈ విషయాన్ని తమ ఫేస్ బుక్ పేజీలో తెలిపారు.ఒకవేళ ఆలస్యంగా ఈ పుస్తకాన్ని తిరిగి ఇచ్చినందుకు లేట్ ఫీజు వేస్తే రూ.40 వేలు అవుతుందట.అయితే కరోనా మహమ్మారి సమయంలో లేట్ ఫీజును లైబ్రరీ ప్రతినిధులు ఎత్తివేశారు.

తన డ్రైవర్ పెళ్లికి హాజరై.. పెళ్ళికొడుకుని కారులో మండపానికి తీసుకొచ్చిన ఎమ్మెల్యే (వీడియో)
Advertisement

తాజా వార్తలు