వైరల్.. మెహ్రీన్ తో బ్రేకప్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన భవ్య.. !

టాలీవుడ్ లో మెహ్రీన్ కౌర్ నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

అతి తక్కువ సమయం లోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని వరస అవకాశాలు అనుకుంటుంది.

తెలుగు లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా అడపా దడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.కానీ అందరు షాక్ అయ్యే విధంగా పెళ్లి చేసుకుంటున్నట్టు ప్రకటించింది.

అంతేకాదు ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు.ఈమె హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనుమడు తో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అయ్యింది.

హర్యానా కాంగ్రెస్ లీడర్ అయినా భవ్య బిష్నోయ్ ను వివాహం చేసుకోవడానికి రెడీ అయిపొయింది.ఇప్పటికే కాబోయే భర్తతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూటింగ్ లో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.

Advertisement
Bhavya Bishnoi Reaction On His Marriage Cancel Issue With Mehreen, Mehrene Marri

త్వరలోనే పెళ్లి డేట్ ప్రకటిస్తారు అనుకుంటున్న సమయంలో బ్రేకప్ అని ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చింది.మెహ్రీన్ పెళ్లి జరగడం లేదంటూ చెప్పిన దగ్గర నుండి ఈ పెళ్లి ఆగిపోవడానికి రకరకాల కారణాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భవ్య కుటుంబం ఆమె కెరీర్ కు అడ్డం అనే పెళ్లి ఆపేసిందంటూ వార్తలు వస్తున్నాయి.ఈ వార్తలతో భవ్య షాకింగ్ కామెంట్స్ చేసాడు.

Bhavya Bishnoi Reaction On His Marriage Cancel Issue With Mehreen, Mehrene Marri

మా మధ్య వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా మేము పరస్పర ఒప్పందంతోనే ఈ పెళ్లి కాన్సుల్ చేసుకున్నామని భవ్య తెలిపారు.మెహ్రీన్ ను ఎంతో ప్రేమించానని, మా ఇద్దరిది మంచి జోడీ అవుతుందని అనుకున్నాను.కానీ తన నుండి విడిపోతున్నందుకు బాధ పడలేదని తెలిపారు.

Bhavya Bishnoi Reaction On His Marriage Cancel Issue With Mehreen, Mehrene Marri

ఈ విషయంలో తమ కుటుంబాన్ని ఎవ్వరు ఎమన్నా అస్సలు ఊరుకోనని.చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.ఆమె ఎప్పుడు సంతోషంగా ఉంటూ తన కలలన్ని నెరవేర్చు కోవాలని నేను కోరుకుంటున్నానని భవ్య సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

ఇప్పుడు ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు