గిన్నిస్ రికార్డ్ కోసం ఏకంగా అంత మద్యం తాగేసిన 22 ఏళ్ల యువకుడు!

‘ఈమధ్య కుర్రాళ్ళు మామ్మూలుగా లేరు, కెలికితే కామెడీ చంపేస్తారు’ అనేది ఏ సినిమాలో డైలాగో తెలియదు కానీ, ఈ జనరేషన్ కుర్రాళ్ళు మామ్మూలుగా లేరని ఈ ఒక్క సంఘటనే చెబుతుంది.గిన్నిస్ రికార్డ్ కోసం రకరకాల విన్యాసాలను చేసిన వారిని చూసుంటారు.

 The 22 Year Old Who Drank So Much Alcohol At Once For The Guinness Record ,gunni-TeluguStop.com

కానీ గిన్నిస్ రికార్డ్ కోసం మద్యం చెరువులో దూకినవారిని ఎపుడైనా చూసారా? అదేనండి… మద్యాన్ని లీటర్ల కొలది తాగినవారిని చూసారా? అయితే ఈ కథ చదవండి.మీకు పూర్తిగా మత్తు దిగిపోకపోతే నన్నడగండి.

తాజాగా.ఓ వ్యక్తి గిన్నిస్ రికార్డ్ కోసం మద్యాన్ని మంచినీళ్లలాగా తాగేశాడు.ఇంగ్లాండ్‌లోని బ్రైటన్‌కు చెందిన నాదన్ క్రింప్ 22 ఏళ్ల యువకుడు 17 గంటల వ్యవధిలోనే సుమారు 67 పబ్‌లకు తిరిగి అదేపనిగా మందుని లాగించేసాడు.దాంతో ఏకంగా గిన్నిస్ రికార్డ్‌లో చోటు దక్కింది.24 గంటల వ్యవధిలో అత్యధిక పబ్‌లకు తిరిగి ఆల్కాహాల్ సేవించిన వ్యక్తిగా రికార్డ్ నెలకొల్పాడు.అయితే, గిన్నిస్ బృందం ప్రకారం.

పబ్‌లను సందర్శించే క్రమంలో ఆల్కాహాలే సేవించవలసిన అవసరం లేదనడంతో నాదన్ క్రింప్ ఒక పబ్‌లో మద్యం, వేరొక పబ్‌లో పానీయం తాగేవాడు.

Telugu Brighton, England, Gunnis, Nathan Crimp, Latest-Latest News - Telugu

అతగాడు వెళ్లిన ప్రతీ పబ్‌ నుంచి ఆల్కాహాల్ లేదా పానీయం తాగినట్లు రశీదులు, సాక్షి సంతకాలను సేకరించేవాడు.ఇలా చేయడంలో తమ స్నేహితులు కూడా తనకు హెల్ప్ చేసారు.తాను సందర్శించిన పబ్‌లలో బీర్, షాట్స్, టకీలా, లేగర్ ఉన్నట్లు ఆ యువకుడు తెలియజేశాడు.

ఇక ఇదంతా ఒకెత్తయితే.ఇంత తక్కువ సమయంలో 20 నుంచి 30 లీటర్ల పానీయాలు తాగడం వలన.ఎక్కువ సమయం టాయిలెట్‌కే సరిపోయిందని చెప్పుకొచ్చాడు.అయితే ఇలా చేయడానికి ప్రధాన కారణం.

క్యాన్సర్‌తో చనిపోయిన తన కుక్క జ్ఞాపకార్థంతో.శునకాల ట్రస్టుకు నిధుల సమీకరణకు ఈ అవకాశం ఉపయోగించుకున్నట్లు తెలియజేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube