దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ( Nayanatara ) గురించి చెప్పాల్సిన పనిలేదు.ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న వరుస అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నయనతార గత కొంతకాలంగా డైరెక్టర్ విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) నుప్రేమిస్తూ గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఇక పెళ్లయిన తర్వాత ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చారు.ఇలా తల్లిదండ్రులుగా మారిన విగ్నేష్ ప్రస్తుతం వారి సినిమా పనులలో వారు బిజీగా గడుపుతూ మరోవైపు తల్లిదండ్రులుగా బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు.
ఇకపోతే నయనతార విగ్నేష్ ప్రేమ ఎలా మొదలైంది.అసలు వీరి ప్రేమ కథ ఏంటి అనే విషయాలను తాజాగా విగ్నేష్ తెలియజేశారు.నయనతారతో తనకు పరిచయం ఏర్పడటానికి తనని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి హీరో ధనుష్ ( Danush )కారణమంటూ విగ్నేష్ ఈ సందర్భంగా వెల్లడించారు.తాను డైరెక్టర్ గా మారి పోడాపోడి అనే సినిమా చేశాను ఈ సినిమా ఘోర పరాజయం ఎదుర్కొంది.
ఇలా తన కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలోనే నేను రౌడీరౌడీనే అనే కథ రాశాను ఈ కథ హీరో ధనుష్ కి వినిపించగా ఆయన ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చారు.

కథ మొత్తం విన్నటువంటి ధనుష్ నయనతారని( Nayanatara ) కలవమని చెప్పారు అయితే నయనతారను కలిసి స్టోరీ చెప్పిన తాను ఒప్పుకోదేమో అనిపించింది.నజ్రియాను ( Najriya ) కలుస్తానని చెప్పగా నయనతారని కలవమని ధనుష్ చెప్పారు.అలా ధనుష్ వల్లే నేను నయనతారను కలిశానని ఈ సందర్భంగా విగ్నేశ్ వెల్లడించారు.
నయనతారను కలిసిన తరువాత ఆమె తనకు ఎంతో గౌరవం మర్యాద ఇచ్చిందని ఆ క్షణమే తనతో ప్రేమలో పడిపోయానని విగ్నేష్ వెల్లడించారు.ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ సమయంలోనే మేమిద్దరం ప్రేమలో పడిపోయామని విగ్నేష్ తెలిపారు.

ఇలా ప్రేమలో ఉన్న మేమిద్దరం మా ప్రేమ విషయాన్ని బయటకు చెప్పలేదు సెట్లో కూడా బయటపడకుండా చాలా భయంగా జాగ్రత్తగా ఉండే వాళ్ళం.ఇక నయనతారతో తాను డేటింగ్ లో ఉన్నా కూడా ఎప్పుడు తన కెరవాన్ వద్దకు కూడా వెళ్లేవాడిని కాదని, షూటింగ్ లొకేషన్లో కూడా తనని నయన్ మేడమ్ అని పిలిచేవాడిని అంటూ ఈ సందర్భంగా విగ్నేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







