Krishna Funeral Mahaprasthanam : కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగడానికి అదే కారణం.. అసలు విషయం చెప్పిన కృష్ణ సోదరుడు!

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఈనెల 15వ తేదీన తుది శ్వాస విడిచారు.

అయిదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ కళామతల్లికి ఎన్నో సేవలు చేసినటువంటి కృష్ణ సినీ ప్రస్థానం ముగిసింది.

ఈయన మంగళవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించడంతో బుధవారం ఈయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో నిర్వహించారు.ఇలా కృష్ణ గారికి ప్రత్యేకంగా పద్మాలయ స్టూడియో ఉన్నప్పటికీ ఆయన అంత్యక్రియలను పద్మాలయ స్టూడియోలో కాకుండా జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు.

గతంలో రామానాయుడు చనిపోయినప్పుడు రామానాయుడు స్టూడియోలో ఆయన అంత్యక్రియలను నిర్వహించి స్మృతి వనం ఏర్పాటు చేశారు.అలాగే ఏఎన్నార్ చనిపోయినప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఆయన అంత్యక్రియలను నిర్వహించి అక్కడ స్మృతి వనం ఏర్పాటు చేశారు.

ఇక కృష్ణ గారి అంత్యక్రియలను కూడా పద్మాలయ స్టూడియోలో నిర్వహించి ఆయన స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తారని అందరూ భావించినప్పటికీ మహేష్ బాబు మాత్రం తన అంత్యక్రియలను మహాప్రస్థానంలో జరగాలని పట్టు పట్టి మరి అక్కడ జరిపించారంటూ మహేష్ బాబు వ్యవహారంపై కొందరు విమర్శలు కురిపించారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈ విషయంపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందించి కృష్ణ అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగడానికి గల కారణాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణ గారి భార్య అంత్యక్రియలను మహాప్రస్థానంలో చేయటం వల్ల ఆయన అంత్యక్రియలను కూడా అక్కడే నిర్వహించామని తెలిపారు.ఇకపోతే కృష్ణ గారి అంత్యక్రియలను మహాప్రస్థానంలో చేసినప్పటికీ ఆయన జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఒక మెమోరియల్ హాల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఇందులో కృష్ణ గారి 30 అడుగుల కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలను ఆ సినిమాకు సంబంధించిన విషయాలను కూడా పొందుపరుస్తామని తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020
Advertisement

తాజా వార్తలు