చిరంజీవితో అదే సమస్య.. అందుకే అందరివాడు సినిమా ప్లాప్: శ్రీను వైట్ల

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిరంజీవి ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలను చూశారు.

అలాగే ఒకప్పుడు ఇండస్ట్రీలో దర్శకుడు శ్రీనువైట్ల అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనకు తెలిసిందే.ఇక ఈ స్టార్స్ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున అంచనాలను పెట్టుకుంటారు.

ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అందరివాడు.అయితే ఈ సినిమా అనుకున్నంత అంచనాలను చేరుకోలేక పోయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాగా నిలబడింది.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీనువైట్ల ఈ సినిమా విశేషాల గురించి గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ అందరివాడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణం సినిమా కథ అని, ఆ కథలో తాను రచించలేదన్న విషయాన్ని శ్రీనువైట్ల తెలియజేశారు.

Advertisement
This Is The Problem With Chiranjeevi Andarivadu Movie Flop Says Srinu Vaitla Det

కథ సిద్ధంగా ఉంది వచ్చి డైరెక్ట్ చేయమంటే చేశానని అయితే అప్పటికే చిరంజీవి కోసం ఒక కథను సిద్ధం చేసి పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా శీను వైట్ల వెల్లడించారు.అయితే మరి ఆ విషయాన్ని చిరంజీవిగారికి ఎందుకు చెప్పలేదు అన్న ప్రశ్న శ్రీనువైట్లకు ఎదురైంది.

This Is The Problem With Chiranjeevi Andarivadu Movie Flop Says Srinu Vaitla Det

ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ చిరంజీవి గారు ఒక పెద్ద స్టార్.ఆయనతో వచ్చిన సమస్య అది.అతను స్టార్ కావడం వల్ల అతను తిరిగి సమాధానం చెప్పలేమని ఈ సందర్భంగా శ్రీను వైట్ల వెల్లడించారు.అలా 2005లో భూపతి రాజా అందించిన అందరివాడు సినిమా కథను తాను డైరెక్ట్ చేశానని ఈ సందర్భంగా శ్రీను వైట్ల వెల్లడించారు.

This Is The Problem With Chiranjeevi Andarivadu Movie Flop Says Srinu Vaitla Det

ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల సినిమాల విషయానికొస్తే ఢీ సినిమా సీక్వెల్ గా మంచు విష్ణుతో కలిసి ఢీ అంటే ఢీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు