జోర్దార్ సుజాత ( Sujatha ) పరిచయం అవసరం లేని పేరు జోర్దార్ వార్తలు ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నటువంటి ఈమె తిరిగి జబర్దస్త్( Jabardasth )కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ టీమ్ లో కమెడియన్ గా సందడి చేస్తూ వచ్చారు.
ఇలా రాకింగ్ రాకేష్( Rocking Rakesh ) టీంలో పని చేస్తున్నటువంటి రాకేష్ తో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో గత ఏడాది ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.ఇలా పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ వీరి కెరియర్ పరంగా ఎంతో బిజీ అయ్యారు.

సుజాత ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలతో పాటు జబర్దస్త్ కార్యక్రమంలోనూ అలాగే వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉండగా రాకేష్ సైతం ఇతర బుల్లితెర కార్యక్రమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈ దంపతులు వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉన్నారు.ఇకపోతే తాజాగా జోర్దార్ సుజాతకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.ఈమె త్వరలోనే తల్లి కాబోతున్నారు అనే వార్త వైరల్ అవుతుంది.

ఇటీవల ఈమె కుటుంబ సభ్యులు తనకు సీమంతపు ( Baby Shower ) వేడుకలను జరిపించారని తెలుస్తుంది .ఈ సీమంతపు వేడుకలలో భాగంగా గెటప్ శ్రీను భార్య పాల్గొని సందడి చేశారు అయితే సుజాతతో కలిసి దిగిన ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాపీ ఫర్ యు కంగ్రాట్యులేషన్స్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.దీంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఇవి చూసినటువంటి నెటిజన్స్ సుజాత తల్లి కాబోతుందా.ఎక్కడ చెప్పనే లేదే అంటూ కామెంట్ చేస్తున్నారు అయితే ఈమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని రహస్యంగా ఉంచడానికి కారణం లేకపోలేదు.ఇటీవల అవినాష్( Avinash ) భార్య అనూజ ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేస్తూ ఆమె బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చేవారు.
అయితే కొన్ని కారణాల వల్ల తమ బిడ్డను కడుపులోనే కోల్పోయిన సంగతి తెలిసిందే.ఆ భయం కారణంగానే సుజాత కూడా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని బయటకు చెప్పలేదని తెలుస్తోంది.